లవర్స్ ఆత్మహత్యా యత్నం, ఒకరి మృతి: బాలుడి హత్య

సాయికుమార్ డిగ్రీ రెండో సంవత్సం చదువుతుండగా సౌమ్య ఇంటర్ చదువుతోంది. అమ్మాయిని తీసుకుని తాను నిజామాబాద్ వెళ్తున్నట్లు సాయి కుమార్ ఫోన్లో చెప్పాడని, పెళ్లి చేస్తామని నచ్చజెప్పామని, ఇంతలోనే ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టారని సాయి కుమార్ బంధువులు అంటున్నారు. సౌమ్య పోన్ ద్వారా విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన నిజామాబాద్ బయలుదేరారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ప్రేమ జంట ప్రయత్నించింది.
ఇదిలా వుంటే, ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. భాగ్యనగర్ నాలుగో లైన్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. హత్యకు గురైన బాలుడిని చైతన్యకృష్ణగా గుర్తించారు. అతను మాంటిస్సోరి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. బంధువుల ఇంట్లో ఉండి అతను చదువుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడు ప్రైవేట్ పాఠశాల యూనిఫాం ధరించి ఉండడంతో దాని ఆధారంగా పోలీసులు బాలుడిని గుర్తించగలిగారు. శనివారం తెల్లవారు జామున దుండగులు బాలుడి గొంత నులిమి పక్కనే ఉన్న నీటకుంట సమీపంలో శవాన్ని పడేశారు.












Click it and Unblock the Notifications