చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేల ఫైట్ ప్రారంభం: మద్యంపై భూమన దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhumana Karunakar Reddy
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మద్యాన్ని నిషేధించి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. హిందువులకు పవిత్ర స్థలమైన తిరుపతిలో షిరిడీ తరహాలో మద్యం నిషేధించాలని ఆయన కోరుతున్నారు. దీక్ష ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుని పాదాలను మద్యంతో కడుగవద్దని, మంచినీటితో కడుగుతామని అన్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలన్నదే తన డిమాండ్ అన్నారు. ప్రపంచంలోని వంద కోట్ల హిందువులకు తిరుపతి ఆధ్యాత్మిక నగరం అని, హిందువుల మనోభావాలు గౌరవించాలంటే మద్యరహిత నగరంగా మార్చాలన్నారు. తాను ఉప ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వెళ్లినప్పుడు చాలామంది మహిళల నుండి అందిన ఫిర్యాదుల మేరకే తాను దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.

భూమన కరుణాకర్ రెడ్డి దీక్షకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. దీక్షా ప్రారంభ సమయంలో తరలి వచ్చిన మహిళలు మద్యం బాటిళ్లను పగుల గొట్టి తమ నిరసనను వ్యక్తపరిచారు. తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా తన నిరసన దీక్షను చేపట్టారు.

కాగా సోమవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లను చేపట్టనుంది. ఇలాంటి సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి నిరసన దీక్షను చేపట్టడం అధికార పార్టీలో కలవరం రేపుతోంది. అయితే నిబంధనల ప్రకారం ఇప్పటికే తిరుమలకు సమీపంలో మద్యం దుకాణాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అయినప్పటికీ భూమన దీక్ష చేపట్టడం రాజకీయ లబ్ధి కోసమే అని విమర్శిస్తున్నారు.

English summary

 YSR Congress party leader and Tirupati MLA Bhumana Karunakar Reddy took fast on Sunday against liquor in Tirupati. He demanded Kiran Kumar Reddy government to dont give permission to sale liquor in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X