ఎన్నిక: సుప్రీంలో పొన్నాలకు చుక్కెదురు, జరిమానా

కాగా 2009వ సంవత్సరంలో పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగాం నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై గెలిచారు. అయితే పొన్నాల గెలుపు అక్రమమని కొమ్మూరి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు రీకౌంటింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పొన్నాల సుప్రీంను ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. పొన్నాల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్నికలలో పొన్నాల లక్ష్మయ్యకు వచ్చిన ఓట్ల కంటే ఎనభై ఓట్లను ఎక్కువగా లెక్కించారని అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్‌లలో కూడా చెల్లని ఓట్లను ఆయనకు వచ్చినట్లుగా లెక్కించారని ఆరోపిస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
పొన్నాల లక్ష్మయ్య గెలుపు అక్రమని ఎక్కడా ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించారు. అయితే ఆయన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. కాగా సుప్రీం తీర్పుపై స్పందించిన పొన్నాల.. పిటిషనర్ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ఆరోపణలు వాస్తవం కాదని, తాను దేనికీ భయపడేది లేదని చెప్పారు. కాగా పొన్నాల రీకౌంటింగ్‌కు స్వచ్చంధంగా ఒప్పుకోవాలని కొమ్మూరి సూచించారు.












Click it and Unblock the Notifications