• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ పార్టీకి స్థానం లేకుండా చేయాలి: కోదండరామ్

By Srinivas
|

Kodandaram
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయించిందని చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం చెప్పారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఐకాస శనివారం చర్చించింది. అనంతరం నోమా కల్యాణ మండపంలో కోదండరామ్ విలేకరులతో మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించటానికి తెలంగాణ మార్చ్ పేరుతో సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈనెల 20న జిల్లా జెఏసిల విస్తృత స్థాయి సమావేశాలు జరిపి.. వ్యూహాన్ని సిద్ధం చేస్తామన్నారు. ఈ నెల 21 నుంచి 30 వరకు ఉద్యమ విస్తరణ ఉంటుందని, ఆగస్టు 1 నుంచి 85 రోజులు వరసగా ప్రచార కార్యక్రమాలు, ఆందోళనలు ఉంటాయని చెప్పారు. సమావేశానికి తెరాస, బిజెపిలను ఆహ్వానించలేదు.

న్యూడెమోక్రసీ నేతలు, ఉద్యోగ-ప్రజా సంఘాల నేతలతోపాటు, ఐకాస జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. తెరాస, బిజెపి ఐకాసలోనే ఉన్నాయని, భవిష్యత్తులోనూ కలిసే పని చేస్తామని కోదండరామ్ చెప్పారు. జగన్ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని నిర్ణయించినట్లు కోదండరాం తెలిపారు. సీమాంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్, టిటిడిపి, జగన్ పార్టీలను ఎండగడుతూ ప్రజలను కదిలించాలని తీర్మానించినట్లు చెప్పారు. సీమాంధ్ర పాలకుల జేబు సంస్థగా కాంగ్రెస్ పార్టీ మారిందని కోదండరాం విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీని నమ్మటానికి లేదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేవరకు, ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు సంఘటితంగా కొట్లాడాలని సమావేశం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలతో ఉండాల్సిన టిటిడిపి అధికార పార్టీతో మిలాఖతై, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో టిడిపి ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని తీర్మానించామన్నారు. తెలంగాణ ఆకాంక్ష వ్యక్తీకరణకు రాష్ట్రపతి ఎన్నికలను ఆయుధంగా మలుచుకోవాలని, ఈ దిశగా రాష్ట్ర సాధనకు కృషి చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు ఈనెల 10న ఐకాస తరఫున ఉత్తరాలు రాస్తామని తెలిపారు.

అయితే రాష్ట్రపతి ఎన్నికల్లోనే ఈ పని చేయాలని కోరమని, కేవలం లేఖలు మాత్రమే రాస్తామని, ఏ రకంగా వ్యవహరించేది వారిష్టమని చెప్పారు. ఉద్యమంలో తప్పనిసరిగా విరామాలు ఉంటాయని, ప్రస్తుతం ప్రకటించిన కార్యాచరణ యథాతథంగా అమలవుతుందన్నారు. రైతులు, యువత, అసంఘటిత రంగాలను కూడా ఉద్యమంలోకి తీసుకొస్తామని తెలిపారు. లక్ష్మీపేట బాధితులను పరామర్శించటానికి ఐకాస ప్రతినిధి బృందం వెళ్లనున్నట్టు చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a brief lull, the Telangana Joint Action 
 
 Committee has decided to intensity the agitation for 
 
 separate Telangana. 'The agitation for separate 
 
 Telangana will be intensified in a phased manner. We 
 
 will have series of meeting, campaigns and 
 
 agitations from July 10 onwards in all Telangana 
 
 districts, including Hyderabad bastis. We have 
 
 called for Telangana march Chalo Hyderabad on 
 
 September 30' said TJAC chairman Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more