బాబు కంటే ముందు మేమే: కెటిఆర్, లగడపాటిపై ఫైర్

బాబు మాదిరి హామీలిచ్చి మాట తప్పటం తమ పార్టీ పద్ధతి కాదన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ పార్టీ అధినేత కెసిఆర్ పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌తో మాట్లాడే సీన్ ఆయనకు లేదన్నారు. ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని, తమ పార్టీ కార్యకర్తలే ఆయన స్థాయికి తగిన సమాధానం చెబుతారన్నారు. తెలంగాణ సాధన కోసం ఏం చేయాలో అందుకు తెరాస సిద్ధంగా ఉందని చెప్పారు.
సమైక్య పాలనలో జల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. జల దోపిడి ఆపే వరకు తమ పార్టీ పోరాడుతుందన్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలు అందుబాటులో లేని గ్రామాలకు రూ.80 కోట్లతో సదుపాయం కల్పించాలన్నారు. ఫ్లోరోసిస్ బాధితులకు రూ.1000 పింఛన్ ఇవ్వాలన్నారు. రాత్రి పూట సాగర్ జలాలను డెల్టాకు అక్రమంగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్ని ఫ్లోరైడ్ బాధితులకు సరఫరా చేయాలన్నారు.
ఫ్లోరైడ్ నివారణ చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చాకే డెల్టాకు నీటిని విడుదల చేయాలన్నారు. ఎస్సారెస్సీ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, ఫ్లోరైడ్ సెంటర్‌ను నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లోరైడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలన్నారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం నడుస్తోందని ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. తెలంగాణ వస్తేనే ముస్లింలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications