వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే, ఎంపీ....: పెద్దల గుట్టు విప్పిన తారా చౌదరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tara Chowdary
హైదరాబాద్: తనను ఓ పార్లమెంటు సభ్యుడు, ఓ శాసనసభ్యుడు, డిజి, డిఎస్పీ, సిఐ వేధించారని వ్యభిచార వ్యవహారం కేసులో అరెస్టయి ఇటీవల విడుదలయిన వర్ధమాన నటి తారా చౌదరి అన్నారు. ఆమె ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లోని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆదివారం పలు విషయాలను చెప్పారు. అప్పట్లో పరిశ్రమలో చౌదరీల డామినేషన్ ఉండేదని, కొందరు తనను తార-సితార అని పిలిచే వారని ఆ తర్వాత క్రమంగా తారా చౌదరిగా మారిపోయిందని చెప్పారు.

వ్యభిచారం కేసులో తనను కావాలనే ఇరికించారని ఆమె చెప్పారు. తనకు సినిమాలు, రాజకీయాలు, సమాజ సేవ అంటే ఇష్టమని తెలిపారు. తాను నటన మానుకుందామనుకున్న సమయంలో ఓ కోఆర్డినేటర్ తనను చిన్ని కృష్ణ వద్దకు తీసుకు వెళ్లాడని, ఆ తర్వాత చిన్ని కృష్ణ తనను వేధించాడని ఆమె చెప్పారు. తనను పోలీసు అధికారి శంకర రెడ్డి కూడా వేధించారని తెలిపారు. చిన్ని కృష్ణ తనతో వల్గర్‌గా మాట్లాడేవారని చెప్పారు.

తనను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. తాను సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాననే దాంట్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను రెండు మూడు సినిమాలలో నటించిన తర్వాత అది అచ్చి రాదని తెలిసి, శ్రీ తార ఆర్ట్స్ అని ఓ బ్యానర్ రిజిస్టర్ చేయించి దాని మీద ఏదైనా ఒక చిన్న సినిమా అయినా చేయాలని అనుకున్నానని చెప్పారు. తనకు సహాయ గుణం ఎక్కువ అని చెప్పారు. తనతో బలవంతంగా ఓ హీరో పేరును, మరొకరి పేరును చెప్పించారని ఆమె తెలిపారు.

ఓ ఛానల్‌లో తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని, అదంతా తనపై ఉద్దేశ్య పూర్వకంగా చేసిన ఆరోపణలు అని అన్నారు. ఆమె వెనుక ఎవరున్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఆ అమ్మాయిని తాను ఏమీ అనదల్చుకోలేదని చెప్పారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపి తనకు పరిచయం లేదని ఇప్పుడు చెబుతున్నారని, పరిచయం లేకుంటే ఆయన ఇంటి నుండి, గెస్టు హౌస్ నుండి, ఢిల్లీ కార్యాలయం నుండి, ఆయన పర్సనల్ మొబైల్ నుండి కాల్స్ ఎలా వస్తాయని ప్రశ్నించారు.

సదరు ఎంపీ సోదరుడి కొడుకు తనతో మాట్లాడే వాడన్నారు. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో తనకు ముఖ పరిచయం లేదని చెప్పారు. తనతో అసభ్యంగా మాట్ల్డాడిన వారివి రికార్డ్ చేశానని చెప్పారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లిన అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకరు తన కుటుంబాన్ని వేధించిన వారిలో ఉన్నారన్నారు. రిమాండులో ఉండగా ఖైదులు తనతో బాగా ఉండేవారని చెప్పారు.

ఎంపి తనను ఇబ్బంది పెట్టినప్పుడు మాజీ ముఖ్యమంత్రి భార్యను తాను ఆశ్రయించానని, ఆమె ఎవరో కాదని లక్ష్మీ పార్వతి గారు అని చెప్పారు. తనకు న్యాయం చేస్తానని చెప్పి ఆ తర్వాత మాత్రం చేయలేదని చెప్పారు. తాను హైదరాబాదు వదిలి వెళ్లే ప్రసక్తి లేదని, తప్పు చేసిన వారంతా బయట ఉండగా, ఏ తప్పు చేయని తాను ఇరుక్కు పోయానని, తన వద్ద ఒరిజినల్స్ ఉన్నాయని, వారందరి బండారాన్ని బయటపెట్టి దోషులుగా నిరూపిస్తానని చెప్పారు.

English summary
Tara Choudary alleged that one Andhra MP and one 
 
 Adilabad MLA are torchered her. She said she is very 
 
 interest about cinema, politics and social service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X