ఇంట్లో రెండు గదులను ఒకటిగా,లేదంటే ఒక గదిని రెండుగా చేయొచ్చా? వాస్తు ఏం చెబుతోంది?
ఇల్లు కట్టి నాలుగైదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంట్లో మార్పులు చేసుకోవడం ఖచ్చితంగా సాధ్యమే. అయితే, రెండు గదులను ఒకటిగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒక గదిని రెండుగా చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. అంటే గోడను పడగొట్టేటప్పుడు, కొత్త గోడను నిర్మించేటప్పుడు వాస్తు నిపుణులు చెబుతున్నవాటిని పాటించాలి.
రెండు గదులను ఒకటిగా చేయడం (గోడను పడగొట్టడం)
రెండు గదుల మధ్య ఉన్న గోడను తొలగించి పెద్ద హాల్‌లా మార్చాలనుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఆ గోడ ఎలాంటిదో తెలుసుకోవడం. ఒకవేళ ఆ గోడపై పైకప్పు లేదా పై అంతస్తు భారం ఆధారపడి ఉంటే, దాన్ని అస్సలు పడగొట్టకూడదు.దాన్ని తీసేస్తే ఇల్లు కుంగిపోయే ప్రమాదం ఉంది. ఇల్లు పిల్లర్ల మీద కట్టినట్లయితే, గదుల మధ్య ఉన్న గోడలు కేవలం విభజన కోసం మాత్రమే ఉంటాయి.వీటిని ఎలాంటి భయం లేకుండా పడగొట్టవచ్చు.గోడను తొలగించే ముందు ఆ గోడ గుండా ఏవైనా కరెంట్ వైర్లు లేదా వాటర్ పైపులువెళ్తున్నాయేమో చూసుకోవాలి. గోడ పడగొట్టే ముందు ఒకసారి మీ ఏరియా మేస్త్రీ లేదా సివిల్ ఇంజనీర్‌కు చూపిస్తే వారు అది పిల్లర్ గోడా కాదా అని స్పష్టంగా చెబుతారు.

ఒక గదిని రెండు గదులుగా మార్చడం (కొత్త గోడ కట్టడం)
ఒక పెద్ద గదిని రెండు చిన్న గదులుగా మార్చడం చాలా సులభం.దీనికోసం ఇల్లు మొత్తం పాడుచేయాల్సిన అవసరం లేదు.దీనికి మూడు పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో తక్కువ బరువుండే ఏఏసీ బ్లాక్స్ దొరుకుతున్నాయి.వీటితో గోడ కడితే కింద ఉన్న స్లాబ్‌పై అదనపు భారం పడదు.పని కూడా చాలా వేగంగా అయిపోతుంది.ఇటుకలు, సిమెంట్‌తో పని లేకుండా కేవలం ఒక రోజులోనే గదిని విభజించాలనుకుంటే
జిప్సం బోర్డులు లేదా డబుల్ లేయర్ ప్లైవుడ్ షీట్లతో పార్టిషన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇల్లు అస్సలు మురికి అవ్వదు.భవిష్యత్తులో వద్దు అనుకుంటే సులభంగా తీసేయవచ్చు.గదిని రెండుగా విడదీసేటప్పుడు రెండు గదులకూ విడివిడిగా గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఉన్నాయో లేదో చూసుకోవాలి.అలాగే కొత్తగా వచ్చే గదికి తలుపు ఎటువైపు పెట్టాలో ముందే ప్లాన్ చేసుకోవాలి.
వాస్తు పరమైన జాగ్రత్తలు
నాలుగైదు ఏళ్ల పాటు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మార్పులు చేస్తున్నారు కాబట్టి వాస్తు నియమాలు దెబ్బతినకుండా చూసుకోవాలి.ఈశాన్య మూలలో ఉన్న గోడలను పడగొట్టడం లేదాఅక్కడ కొత్తగా బరువైన ఇటుకల గోడలు కట్టడం లాంటివి చేయకూడదు.నైరుతి మూల గది ఎప్పుడూ పెద్దదిగా, బరువుగా ఉండాలి.దాన్ని విభజించేటప్పుడు జాగ్రత్త పడాలి.ఇల్లు కట్టిన కొత్తలో లోడ్ అంతా ఒకలా ప్లాన్ చేసి ఉంటుంది.ఇప్పుడు మీరు కొత్తగా ఇటుకల గోడ కడితే ఆ బరువును స్లాబ్ మోయగలదా లేదా అనేది చూసుకోవాలి.












Click it and Unblock the Notifications