తెలంగాణ, వెంటనే రెస్పాన్స్: టిజి వెంకటేష్‌కి జెసి ఫోన్

JC Diwakar Reddy-TG Venkatesh
అనంతపురం/కర్నూలు: రాయల తెలంగాణ విషయంలో తన అభిప్రాయం మార్చుకోవాలని తాను మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డిని కోరతానని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ చెప్పిన వెంటనే ఆయన స్పందించారు. జెసి ఈ విషయం తెలియగానే టిజి వెంకటేష్‌కి ఫోన్ చేసి రాయల తెలంగాణపై తన వైఖరి మారదని చెప్పారు. సమైక్యాంధ్ర విషయంలో వెనక్కి తగ్గవద్దని టిజికి సూచించారు.

కాగా అంతకుముందు రాయల తెలంగాణ విషయంలో మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డిని తన అభిప్రాయం మార్చుకోవాలని తాను కోరతానని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం కర్నూలు జిల్లాలో అన్న విషయం తెలిసిందే. రాయలసీమ వెనుకబాటుతనంపై ఇక్కడి నాయకులం పోరాడకుంటే మరింత నష్ట పోతామని అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాయని అన్నారు.

ఆగస్టు 16వ తేదిన రాయలసీమ హక్కుల ఐక్య వేదిక వార్షికోత్సవం జరుపుతామని చెప్పారు. ఖచ్చితంగా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే తాము ప్రత్యేక రాయలసీమ కోరుతామని, అయితే తమ మొదటి నినాం మాత్రం సమైక్యాంధ్రనే అని చెప్పారు. మన రాష్ట్రం నుండి ముగ్గురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఓలింపిక్స్‌కు ఎంపికవడం గర్వకారణమని అన్నారు. ప్రతి జిల్లాలో బ్యాడ్మింటన్ కోచ్ ఉండాలన్నారు.

హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాలలోని బ్యాడ్మిండన్ అకాడమీలను పునరుద్ధరించాలన్నారు. పార్టీకి రాజీనామా చేసిన వారు రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకే ఓటు వేయాలని గండ్ర వెంకట రమణా రెడ్డి హైదరాబాదులో కోరారు. ఓటు వేసే విషయంలో ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రణబ్‌కే వారి మద్దతు ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+