కెసిఆర్‌కు కౌంటర్: తెలంగాణపై తప్పంటూ యాష్కీ

తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నానుస్తోందని ఆయన విమర్శించారు. హైదరాబాదును ముట్టడిస్తేనే తెలంగాణ వస్తుందని, ఉద్యమ తీవ్రత చూపితేనే పార్టీ అధిష్టానం దిగి వస్తుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో విడిపోయి ఉండడం బాధాకరమని, ఐక్య ఉద్యమం వల్లనే తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు.
ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా బలోపేతం కావాలని చూడడం సరి కాదని, అది రాష్ట్ర ఏర్పాటుకు మంచిది కాదని ఆయన అన్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగించాలని తమ పార్టీ అధిష్టానం భావిస్తోందని ఆయన అన్నారు.
మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తాము కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్‌కు చెప్పినట్లు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సోమవారం ఆజాద్‌ను కలిశారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్రలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో రెండు మాత్రమే ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.
రాజీవ్ యువకిరణాలపై రాష్ట్రంలో తికమక ఉందని, అందుకే తాను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కీ లేఖ రాశానని వివేక్ స్పష్టం చేశారు. రాష్టానికి రావద్దని తాను ప్రధానికి రాసిన లేఖలో చెప్పలేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అధికారుల నిర్లక్షం వల్లనే నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ రాలేదని ఆయన అన్నారు. ఆగస్టులో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.
పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయకపోవడం పట్ల కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై అసహనం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. కార్యకర్తల ఆలోచనలు తీసుకుని ముందుకు సాగితే ఫలితాలు లభిస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications