పని చేయని వాళ్లనే: సమర్థించుకున్న టిజి వెంకటేష్

పని చేయనివాడు ఉన్నా ఒకటే.. చచ్చినా ఒకటేనని తల్లిదండ్రులే అంటుంటారని, వేతనాలు తీసుకొని పని చేయని వాళ్లను అంటే తప్పేముందని వెంకటేష్ ప్రశ్నించారు. వారు తప్పులు సరిదిద్దుకుంటే ఐఏఎస్‌లను కాల్చేయాలన్న వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెప్పడానికి సిద్ధమేనని చెప్పారు. పని చేయని ఐఏఎస్‌లు, రాజకీయ నేతల గురించే తానా వాఖ్యలు చేసినట్లు మంత్రి వెంకటేష్ ఆదివారం వివరణ ఇచ్చారు.
తాను కూడా మానవమాత్రుడినేనని, పనులు కానప్పుడు బరస్ట్ అవుతుంటానని అన్న టిజి.. తమ రాయలసీమలో చంపుతామనడం సాధారణమేనని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కూడా ప్రధాని అయిన కొత్తలో స్థంభానికి కట్టి ఉరితీయాలంటూ మాట్లాడారని, తాను కూడా ఎమోషన్లోనే మాట్లాడానని పేర్కొన్నారు. పని చేసేవారికి తాను సెల్యూట్ చేస్తానని అన్నారు. తాను రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పానని గుర్తు చేశారు.
అధికారులకు ప్రతి ఒక్కటీ గిల్లి చెప్పలేమని పేర్కొన్నారు. చెప్పే విధానాలు రెండు రకాలుగా ఉంటాయని, ఒకటి నయానా.. రెండోది భయానా అన్నారు. చిన్న నీటిపారుదల శాఖ కింద 65వేల చెరువులు, 65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, వీటి మరమత్తులకు నిధుల కేటాయింపుల గురించి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అడుగుతుంటారని పేర్కొన్నారు. గతేడాది తన శాఖకు కేటాయించిన నిధుల్లో 90 శాతం ఖర్చు పెట్టామని, ఈ ఏడాది రూ.3వేల కోట్లు కేటాయించారని అన్నారు.
అధికారులు పని చేసి మార్పు చూపిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కర్నూలు జిల్లాలో చెరువులు మరమ్మతులు చేయడం లేదన్నారు. తన వ్యాఖ్యలలోని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలన్నారు. గడ్డం పట్టుకొని అడుగుతున్నామని, వాళ్లు పిలిచినప్పుడే చాంబర్లకు వెళుతున్నామని అయినా స్పందించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications