వైయస్‌కు సోనియా గాంధీ చెప్పారా: జగన్ పార్టీ నేత

Vasireddy Padma
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాల పేర్లు మార్చాలనే మంత్రి వర్గ కమిటీ సిఫార్సుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెసు పార్టీవే అయితే ఇతర కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

ఈ పథకాలు అమలు చేయాలని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే చెప్పారా అని ఆమె అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అక్కసుతోనే ఆ విధంగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత మూడేళ్లలో మీరేం చేశారని ఆమె కాంగ్రెసు నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం ఛిన్నాభిన్నమైందని ఆమె విమర్శించారు.

చేతనైతే వైయస్ రాజశేఖర రెడ్డిలా బతకాలని, పథకాలు పేర్లు మార్చే ప్రయత్నం చేయవద్దని ఆమె అన్నారు. నార్కో టెస్టు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన విషయం సిబిఐకి గుర్తు లేదా అని ఆమె అడిగారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు నార్కో టెస్టులు జరపడానికి అనుమతించాలని కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేయడంపై ఆమె ఈ విధంగా ప్రతిస్పందించారు.

ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం నశించిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పథకాలకు ఏ పేర్లు పెట్టినా ప్రజలు కాంగ్రెసును నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా తయారైందని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+