ఓపిక పట్టండి, జగన్ బయటకొస్తారు: వైయస్ విజయమ్మ

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిత్రావతి నీటి కోసం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకునే మనసు లేదన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని, మరిన్ని జిల్లాలకు ఇది విస్తరించే ప్రమాదముందన్నారు. పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వక పోవడం వల్ల 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనవిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్ బయటకు వచ్చి రైతులకు మరింత అండగా నిలుస్తారన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రైతుల కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయడం లేదన్నారు.
మనసుంటే మార్గముంటుందని, కానీ ఈ ప్రభుత్వానికి ఆ మనసు లేదన్నారు. భూపాలపల్లిలో కిరణ్ తాగునీటి ప్రాజెక్టును ప్రారంభిస్తూ కనీసం వైయస్ పేరును కూడా గుర్తు చేయలేదన్నారు. తన హయాంలో వ్యవసాయాన్ని పట్టించుకోని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.












Click it and Unblock the Notifications