కేరళ నరహంతకుడు తిరుపతిలో, ఖమ్మంలో సైకో సాంబ!

ఆంటోనీ పైన కేరళలో రెండు వందల వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకే పోలీసు స్టేషన్‌లో 35కు పైగా కేసులు ఉన్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో నర హంతకుడిగా చలామణి అవుతున్నాడు. గత నెల 25న కేరళలోని పొల్లం జిల్లా యందువారిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఎస్ఐని కత్తితో పొడవడమే కాకుండా పోలీసు డ్రైవర్‌ను దారుణంగా హతమార్చాడు.
తిరుపతి నుండి రేణిగుంట పరిసరాలలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సైకో ఆంటోనీ పదిహేడు మందిని వివాహం చేసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం పోలీసుల కన్నుగప్పి పరారైన గుంటూరు సైకో సాంబశివ రావు ఖమ్మం జిల్లాలో సంచరిస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.
సైకో సాంబ కొండపల్లి హైవే మార్గం గుండా ఖమ్మం జిల్లా చంద్రగొండకు చేరుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. సాంబ ఈ గ్రామానికి చెందిన ఓ మహిళను బట్టలు అడిగినట్లుగా చెబుతున్నారు. ఉదయం నాలుగు గంటలకు వచ్చిన అతను తాను ఇబ్బందులలో ఉన్నానని తనకు బట్టలు ఇవ్వాలని కోరాడని, ఆమె మానవతా దృక్పథంతో ఇచ్చిందని, అయితే ఆ తర్వాత అతను సైకో సాంబ అని తెలిసిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications