వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పివి చెప్పినా పదవి రాలేదు, తలరాత లేదు: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
కాకినాడ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా సర్పవరం గ్రామంలో పార్టీ కార్యకర్తల సభలో మాట్లాడారు. బొత్సతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామంతా కలిసి పని చేస్తున్నామని చెప్పారు. కొట్టుకుంటున్నారన్న వార్తలు నమ్మవద్దన్నారు.

పదవి వెంట మనం పరుగెడితే అది మరింత దూరం వెళుతుందన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే పదవి దానంతట అదే వస్తుందని, తాను గతంలో మంత్రి పదవి అడిగానని కాని అది రాలేదని, అడగకుండానే చీప్ విప్, స్పీకర్ పదవులు వచ్చాయన్నారు. తల రాత ఉంటే పదవులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయన్నారు. 1991లో అప్పటి ప్రధానమంత్రి తనకు మంత్రి పదవి వస్తుందని బెస్ట్ అఫ్ లక్ చెప్పారని కానీ అది అప్పుడు రాలేదన్నారు. తలరాత లేదన్నారు.

నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. స్థానిక నేతల వైఖరి వల్లే నామినేటెడ్ పోస్టులలో జాప్యం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే ఓ పేరు తీసుకు వస్తే, ఎంపి మరో పేరు తీసుకు వస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలన్నారు. కార్యకర్తలను మరిచిపోయిన ప్రజాప్రతినిధులు తిరిగి గెలుపొందలేరన్నారు. కార్యకర్తలే పార్టీకి చాలా ముఖ్యమని అన్నారు. ఢిల్లీలో, హైదరాబాదులో తిరిగితే పదవులు రావన్నారు.

తనను చీప్ విప్‌గా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, అధిష్టానం నియమించాయన్నారు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయన్నారు. కార్యకర్తల సమస్య వారికి, నేతల సమస్య నేతలకు, రాష్ట్రాల సమస్య ఇలా ఎవరి సమస్యలు వారికి సాధారణంగా ఉండేవే అన్నారు. అమెరికా దేశానికి కూడా సమస్యలు ఉంటాయన్నారు. కాంగ్రెసును గెలిపించిన రామచంద్రాపురం ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, మరిన్ని చేపడుతుందన్నారు.

ప్రభుత్వం వైఖరి వల్ల కార్యకర్తలను ప్రశ్నించే స్థితికి తాము తీసుకు రామన్నారు. తల ఎత్తుకు తిరిగేలా పరిపాలన చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని వేలెత్తి చూపడం కంటే సమస్య పరిష్కారానికి సూచనలు చేస్తే బావుంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొత్తగా బిసి నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.

ఇన్నాళ్లుగా గుర్తుకు రాకుండా ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. గత పదేళ్లలో బిసిలకు ఎన్ని నిధులు కేటాయించారో ఈ ఒక్క సంవత్సరమే తాము దాదాపు అంత కేటాయించామని చెప్పారు. బాబు బిసిలు అంటూ కొత్త నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధితో పని చేసి పదవి రావాలంటే కేవలం కాంగ్రెసు పార్టీలోనే సాధ్యమన్నారు. కానీ టిడిపిలో అలా కాదన్నారు. వ్యక్తి కోసం నడిచే పార్టీల వైపు వెళ్లవద్దని సూచించారు.

English summary
CM Kiran Kumar Reddy said that he have no differences with PCC chief Botsa Satyanarayana. He lashed out at Telugudesam Party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X