అదృశ్యమైన టెక్కీ మృతి, ఏనుగు దాడిగా అనుమానం

Satvik Shastry
బెంగళూర్: అదృశ్యమైన ద్విక్ శాస్త్రి అనే 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. బెంగళూర్‌లోని నేషనల్ పార్కు నుంచి అతను తప్పిపోయాడు. అతను శవమైన తేలాడు. పార్కులోనే అతని శవాన్ని అటవీ అధికారులు కనుక్కున్నారు. అతనిపై ఏనుగు దాడి చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. అతని కుడి కాలు విరిగిపోయి ఉంది. శవానికి సమీపంలో ఏనుగు పాద ముద్రలు కనిపించాయి. రక్తం మరకలు కూడా ఉన్నాయి. అతని కోసం హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టాలని నిర్ణయించిన కొద్ది సేపటికే అతని మృతి సమాచారం తెలిసింది.

ఆశిష్, అనుపమ్ అనే మిత్రులతో కలిసి అతను శనివారంనాడు బన్నెర్‌గట్టాలోని బయోలాజికల్ పార్కుకు వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత వెనక్కి వెళ్లిపోదామని వాహనాలు నిలిపిన చోటికి వచ్చారు. తనకు చిన్నపాటి పని ఉందని, అది పూర్తి చేసి వస్తానని చెప్పాడని, తమను వెళ్లిపోవాలని చెప్పాడని సాద్విక్ మిత్రుడు ఆశిష్ చెప్పాడు. ఐదు నిమిషాల తర్వాత చూస్తే అతను తమను కలుసుకోకపోవడంతో ఆగిపోయామని అతను చెప్పాడు.

కొద్ది సేపు వెతికామని, అయినా అతను కనిపించలేదని, తాము కాసవనహళ్లికి వెళ్లామని అనుపమ్ చెప్పాడు. సాద్విక్ సురక్షితంగానే ఉంటాడని అటవీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్కు చుట్టూ గ్రామాలున్నాయని, ఓ రెండు గంటలు నడిస్తే ఏదో ఒక ఊరు తగులుతుందని అధికారులు చెబుతున్నారు.

ఓ రోజు పాటు అడవిలో ఉండడం సమస్యేమీ కాదని, అడవిలో లోనికి ఎందుకు వెళ్లడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదని అంటున్నారు. సాద్విక్ న్యూ సిగ్మా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో పనిచేస్తూ జెపి నగర్‌లో ఉంటున్నాడు. సాద్విక్ తల్లి ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తండ్రి బెంగళూర్‌లో అకౌంటింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ సంస్థను నడుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+