హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చలానా రాశారని చేయి చేసుకున్న మహిళా మేనేజర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman attacks traffic cop for parking penalty
హైదరాబాద్: నో పార్కింగ్ ప్రదేశంలో వాహనాన్ని పార్క్ చేయడమే కాకుండా, చలానా విధించిన ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్న ఓ యువతిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్ హోటల్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న దివ్య దత్తా దుబే బుధవారం గ్రీన్ పార్క్ ఎదురుగా ఉన్న స్థలంలో తన ఇండికా వాహనాన్ని నిలిపింది. లోపలికి వెళ్లి తిరిగి బయటకు వచ్చే సరికి అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ రాంగ్ పార్కింగ్‌లో వాహనం పెట్టినందుకు చలాన్ రాశారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన 32 ఏళ్ల దివ్య హోంగార్డు శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ రాజగోపాల్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చేయి చేసుకుంది. దివ్య మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కారును అక్కడ పెట్టింది. నో పార్కింగ్ ప్రదేశంలో పెట్టినందుకు ట్రాఫిక్ పోలీసులు ఆమెకు రూ.200 చలానా వేశారు. కారు పార్కు చేసిన అనంతరం దివ్య లోపలకు వెళ్లింది. అప్పటికే ఆమె డ్రైవర్ మొహమ్మద్ మోసిన్ చలానాను కట్టాడు.

బయటకు వచ్చిన దివ్య తనకు చలానా వేసిన విషయాన్ని తెలుసుకుంది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడింది. చలానా ఎందుకు కట్టించుకున్నారని వారితో వాదనకు దిగింది. పోలీసు చేతిలో ఉన్న చలానా పుస్తకాన్ని చించి వేసింది. దీంతో ఎస్ఐ రాజగోపాల్ ట్రాఫిక్ పోలీస్ శ్రీనివాస్‌తో ఆమె ఫోటో తీసుకోమని చెప్పాడు. దీంతో మరింత ఆగ్రహం చెందిన దివ్య వారిపై దాడి చేసింది. ఓ సమయంలో వారి కాలర్ పట్టుకుంది.

దీంతో ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఇన్‌ఫార్మ్ చేశారు. దీంతో ఆమెను మూడ గంటల సమయంలో అరెస్టు చేశారు. దివ్య పైన ఐపిసి 332, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దివ్యను విచారించిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

English summary

 In a surprising incident of road rage, the sales manager of a hotel was arrested on Wednesday for attacking a traffic sub-inspector and a home guard at Ameerpet after she was fined for a parking offence. The driver of Divya Dutta Dubey, 32, sales manager with Marigold, Green Park Hotel, Ameerpet, had parked the Indica car in a “no parking” area at 12.30 pm and was challaned Rs 200 by Rajagopal Reddy, the Panjagutta traffic sub-inspector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X