చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో ఘోరం: విద్యార్థి చేత మూత్రం తాగించిన టీచర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tamilnadu Map
చెన్నై: పశ్చిమ బెంగాల్‌లోని విశ్వ భారతి విశ్వవిద్యాలయం ఘాతుకాన్ని మరిచిపోక ముందే అటువంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని పెంరబలూరు జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులు 14 ఏళ్ల బాలుడిని విపరీతంగా కొట్టి, అతని చేత అతని మూత్రం తాగించారు.

తెలిసిన వివరాల ప్రకారం - తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి పదే పదే వాష్‌రూంకు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేయసాగాడు. తొలుత అందుకు ఉపాధ్యాయుడు అందుకు నిరాకరించారు. అతను పదే పదే అడుగుతుండడంతో విసుగు చెందిన టీచర్లు అతన్ని కొట్టారు. అతని చేత అతని మూత్రం తాగించారు.

బాధితుడు తమిళనాడులోని కుంభకోణం జిల్లాకు చెందినవాడు. అతను పాఠశాల వసతిగృహంలో ఉంటున్నాడు. ఉపాధ్యాయుల ఘాతుకం తర్వాత విద్యార్థి పాఠశాల నుంచి పారిపోయి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. బాలుడి శరీరంపై గాయాల గుర్తులు, ఉబ్బిన చిహ్నాలు ఉన్నాయి. దాంతో అతన్ని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. పోలీసులు కుంభకోణం వెళ్లి బాలుడి వాంగ్మూలాన్ని, అతని కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు తీసుకున్నారు.

కాగా, విద్యార్థిపై దురాగతానికి పాల్పడిన టీచర్లను యాజమాన్యం ఉద్యోగాల నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో గల విశ్వ భారతి వార్డెన్ ఓ బాలిక చేత ఆమె మూత్రాన్ని తాగించింది. వార్డెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ లభించింది.

English summary
In what can be termed as a revisit to the Visva-Bharati University horror in West Bengal, a 14-year-old boy in Perambalur district of Tamil Nadu was beaten up by three teachers in his school and also made to drink his own urine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X