హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్థం చేస్కొండి:విజయమ్మ, తరిమికొట్టాలి.. రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Vijayasanthi
హైదరాబాద్: చేనేత సమస్యలపై సిరిసిల్లలో తాను నిర్వహించ తలపెట్టిన ధర్నాకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా చేయాలన్న తన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, ఉద్యమ సంఘాలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ధర్నా ప్రజల కోసమని, దీనిని తెలంగాణతోగానీ మరో రాజకీయాంశంతో కానీ ముడిపెట్టవద్దని కోరారు.

విజయశాంతి మండిపాటు
తెలంగాణ బిడ్డలుగా సీమాంధ్ర నేతల కాళ్లు పట్టుకోవద్దని పౌరుషంతో తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆదివారం కరీంనగర్ జిల్లాలో పిలుపునిచ్చారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ సిరిసిల్లలో చేపట్టిన దీక్షా శిబిరంలో ఆమె మాట్లాడారు. విజయలక్ష్మి సిరిసిల్ల ఎందుకు వస్తున్నారో, దేనికి చేనేత దీక్ష చేపడుతున్నారో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని కష్టాలు పడ్డామో గుర్తు చేసుకొని విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని ఆమె కోరారు.

వేములవాడకు వస్తే ఓకే.. కోదండ
వేములవాడలో కోడెను కట్టేందుకు విజయమ్మ వస్తే తమకు అభ్యంతరం లేదని, రాజకీయ పర్యటన కోసం వచ్చే ఆమె తెలంగాణపై వైఖరి చెప్పాల్సిందేనని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం హైదరాబాదులో అన్నారు. వైఖరి చెప్పకుండా ఇక్కడకు వస్తే దారి పొడవునా అడ్డుకుని తీరతామని, విజయమ్మది రాజకీయ పర్యటన కాబట్టే తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

సారయ్య అభ్యంతరం
విజయమ్మ సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టడంపై మంత్రి బస్వరాజు సారయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి తేల్చకుండా ఈ ప్రాంతంలో ఎట్లా పర్యటిస్తారని ప్రశ్నించారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలుచేస్తున్నా వాటిని ప్రచారం చేయడంలో వెనుకబడిందని అన్నారు.

టిఆర్ఎస్‌పై జగ్గారెడ్డి ఫైర్.. విజయమ్మకు ఓకే
చేనేత సమస్యలపై విజయమ్మ చేపట్టబోయే దీక్షను అడ్డుకుంటామని టిఆర్ఎస్ ప్రకటించడంపై ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ రెడ్డి మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమన్నారు. టిఆర్ఎస్ నాయకులు రోజురోజుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్మూర్‌లో జగన్ దీక్షను అడ్డుకోని టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్న కెసిఆర్ ప్రజలలో ఉనికిని కాపాడుకునేందుకు ఈ గిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

English summary
YSR Congress party honorary president and Pulivendula MLA YS Vijayamma appealed Telanganites to don't obstruct her chenetha deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X