సెప్టెంబర్‌లో తెస్తారా: కెసిఆర్‌కు కొండా సురేఖ డెడ్ లైన్

Konda Surekha
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ తీసుకు వచ్చే అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ డెడ్ లైన్ పెట్టారు. కెసిఆర్ తాను చెప్పినట్లుగా సెప్టెంబర్ 15లోకా తెలంగాణ తీసుకు రావాలని సవాల్ చేశారు. టిఆర్ఎస్ నాయకులు రౌడీ మూకలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో వైయస్ విజయమ్మ చేపట్టిన చేనేత దీక్షలో ఆమె మాట్లాడారు.

టిఆర్ఎస్ నాయకులు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను అడ్డుకోవడంలో చూపించిన శ్రద్ధ, ప్రయత్నంలో పదో వంతు చేసినా సిరిసిల్ల నేతన్నల సమస్యలు తీరేవి అన్నారు. 2014 ఎన్నికలలో తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అధికార కాంగ్రెసు సమస్యల పరిష్కారంలో విఫలమైందని, ప్రతిపక్ష తెలుగుదేశం కాంగ్రెసుతో కుమ్మక్కైందని, తెరాస పదేళ్లుగా తెలంగాణ తీసుకు వస్తామని ప్రజలను మభ్య పెట్టిందని.. ఇలా అన్ని పార్టీలు విఫలమైన సమయంలో అందరూ వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారని అన్నారు.

ఏదో ఒక కారణం చూపి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు తెరాస చేస్తోందన్నారు. పరకాలలో చావు తప్పి కన్నులొట్ట పోయిన చందంగా గెలిచిందన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విజయమ్మ దీక్ష చేస్తుంటే కెటిఆర్ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అదే కెటిఆర్ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు.

తమపై టిఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడి వారి తల్లులు, సోదరుల మీద కూడా దాడి చేసినట్లే అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే టిఆర్ఎస్ వైయస్సార్ కాంగ్రెసుపై దాడికి పాల్పడుతోందన్నారు. టిఆర్ఎస్‌తో తెలంగాణ రాదని ప్రజలకు తెలిసి పోయిందన్నారు. సెప్టెంబర్ 15వ తేది లోగా తెలంగాణ రాకుంటే కెసిఆర్ ఏం చేస్తారో చెప్పాలని సవాల్ చేశారు. 2014లో టిఆర్ఎస్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. టిఆర్ఎస్‌తో తెలంగాణ రాదని తేలిపోయిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+