• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోలవరం: తేల్చమన్న బాబు, టిఆర్ఎస్ ససేమీరా

By Srinivas
|

Chandrababu Naidu
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్లపై సందేహాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం టెండర్లపై రేకెత్తుతున్న అనుమానాలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తుతూ.. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డికి మంగళవారం చంద్రబాబు లేఖ రాశారు. పోలవరంపై ప్రజల్లో అపోహలు తలెత్తకుండా టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్ళను స్పీకర్ వద్ద పెట్టాలని డిమాండ్ చేశారు.

పోలవరం టెండర్ల ఖరారులో స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి, ప్రజా ప్రయోజనాలకు గండికొట్టడం శోచనీయమన్నారు. ప్రస్తుత టెండర్ల ఆమోదంలోనూ తెరవెనుక భాగోతం చోటు చే సుకుందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. నచ్చిన కంపెనీలకు టెండరు దక్కే విధంగా ప్రభుత్వంలోని పెద్దలే కీలక పాత్ర పోషించారని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ టెండర్లతో రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల ప్రజాధనం కోల్పోతుందని చెప్పారు. ఈ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సంబంధిత శాఖ మంత్రి చెబుతుంటే... ప్రభుత్వ నిర్ణయంలో అవకతకవలు జరిగాయని మరో మంత్రి చెబుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు బిసి డిక్లరేషన్ పైన వెనక్కి తగ్దే సమస్యే లేదని బాబు స్పష్టం చేశారు.

టిఆర్ఎస్ ససేమీరా

పోలవరం టెండర్లనే కాదు.. ప్రాజెక్టు మొత్తాన్నే నిలిపివేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, టెండర్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటెల ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం కింద మునిగేది తెలంగాణ భూములైతే, పండేవి ఆంధ్రా భూములని, అందుకే తాము ఎలాంటి అనుమతులులేని ఆ ప్రాజెక్టును నిర్మించవద్దని కోరుతున్నట్లు చెప్పారు. మరోవైపు.. తక్షణమే పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయాలని.. లేకుంటే కోర్టుకెళ్లి దానిని నిలుపుదల చేయిస్తానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుందని కేంద్రమే అనుమతులు రద్దు చేసిందని చెప్పారు. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు గుంజేందుకే మరోసారి టెండర్లు పిలిచారని ఆరోపించారు. పోలవరం టెండర్లలో ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడడం దురదృష్టకరమని వైసీపీ నాయకుడు మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే ఏకంగా.. రూ.450 కోట్ల అదనపు అంచనాలతో సోమ సంస్థ పోలవరం టెండర్లను దక్కించుకుందని, ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సోమ సంస్థకు సీఎంవోలోని కొందరు అధికారులు సహకరించారని ఆరోపించారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has written a letter to chief minister Kiran Kumar Reddy on Tuesday on Polavaram project issue. Telangana Rastra Samithi is demanding to don't construct project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X