దక్షిణాఫ్రికా రోడ్డు ప్రమాదం: హైదరాబాద్ విద్యార్థి మృతి

Hyderabad youth killed in accident at Durban
హైదరాబాద్: విహార యాత్రకు దక్షిణాఫ్రికాకు వెళ్లిన హైదరాబాదు యువకుడు ఒకరు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నగరానికి చెందిన ఓర్ల సాయి రామ్ రెడ్డి అనే పంతోమ్మిదేళ్ల యువకుడు దక్షిణాఫ్రికాలోని డర్బన్ విమానాశ్రయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

నగరంలోని కాప్రాలో నివసించే సాయి రామ్ రెడ్డి ఘట్‌కేసర్‌లోని సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు... మొత్తం పద్దెనిమిది మంది గత నెల 28న దక్షిణాఫ్రికా విహారయాత్రకు వెళ్లారు. ఈ నెల 20వ తేదిన భారత్‌కు తిరుగు పయనమయ్యారు.

డర్బన్‌లోని విమానాశ్రయానికి చేరువలో ఉండగా.. సాయి రామ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతడి తలకు బలమైన గాయాలు తగిలాయి. పెద్ద నాన్న రామలింగారెడ్డి అక్కడే ఉండి సాయి రామ్ రెడ్డిని డర్బన్ ఆసుపత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతున్న సాయిరామ్ బుధవారం మృతి చెందాడు. సాయి రామ్‌తో పాటు గాయపడిన రామలింగా రెడ్డి కుమారుడు సందీప్ ప్రస్తుతం గాయాలతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు వ్యాపారవేత్త శ్రీనివాస్ రెడ్డి పెద్ద తనయుడు. మృతదేహం సాయంత్రానికి హైదరాబాద్ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+