హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌ విజయమ్మకు అలా మాకు ఇలా: పొన్నం, వివేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar-Vivek
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తుంటే మా ప్రభుత్వమేనా అనే అనుమానం కలుగుతోందని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, వివేక్‌లు గురువారం అన్నారు. తెలంగాణపై దండయాత్ర చేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని మండిపడ్డారు.

వారి తెలంగాణ పర్యటనకు అసాధరణ భద్రత కల్పించిందని, కానీ తమను సొంత పార్టీ ఎంపీలమని కూడా చూడకుండా తెలంగాణ ఉద్యమంలో అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా ఆందోళనలు చేసిన తమను అడ్డుకున్న ప్రభుత్వం విపక్ష నేతలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. ఢిల్లీలో రాష్ట్ర విభజనపై ఏం జరగలేదని చెప్పడానికి మంత్రి శైలజానాథ్ ఎవరన్నారు.

అతను వాళ్ల ప్రాంతం గురించి మాట్లాడుకోవాలని, తెలంగాణపై మాట్లాడేందుకు అతనికి అధికారం ఎవరిచ్చారన్నారు. తెలంగాణపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోందని చెప్పారు. రిజర్వేషన్ల ఘనత తమదేనని, టిడిపి అధినేత చంద్రబాబు తమదిగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

పోలవరం టెండర్‌లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ టెండర్ల విషయంలో కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారన్నారు. దీనిపై సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్ల అంశంతో కాంగ్రెసు పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా ఉందన్నారు.

English summary
Telangana Congress MPs Ponnam Prabhakar and Viveka were blamed Kiran Kumar Reddy's government for their attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X