పార్థసారథికి శైలజానాథ్ అండ, విభజనపై చర్చ లేదు

Sailajanath
హైదరాబాద్: ఫెరా కేసులో ఇరుక్కున్న మంత్రి పార్థసారథికి మరో మంత్రి శైలజానాథ్ అండగా నిలిచారు. శైలజానాథ్ గురువారం విలేకరులతో మాట్లాడారు. పార్థసారథి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. మంత్రికి శిక్ష విధించిన ఆర్థిక నేరాల కోర్టే ఆయనకు హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు పార్థసారథికి అవకాశముందన్నారు.

ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ధర్మాన ప్రసాద రావు ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వం, పార్టీలకు మంచి సూచనలు చేసిందన్నారు. వ్యూహాత్మకంగా ఈ కమిటీ పని చేసి నివేదికను రూపొందించిందన్నారు. రూపకల్పన కోసం అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుందని చెప్పారు. పార్టీకి సొంత పత్రిక, ఛానల్ ఉంటే తప్పేమిటన్నారు.

రాష్ట్ర విభజనపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగడం లేదని శైలజానాథ్ చెప్పారు. తెలంగాణపై చర్చ జరుగుతుందనేది అవాస్తవమన్నారు. తన ఓటు సమైక్యాంధ్రకే అన్నారు. పార్టీ కూడా సమైక్యాంధ్రకే అనుకూలంగా ఉంటుందని చెప్పారు. మరోవైపు పార్థసారథిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, కడియం శ్రీహరిలు టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఈసిని తప్పు దోవ పట్టించిన మంత్రి పార్థసారథిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నేరస్తుడిని మంత్రివర్గంలో ఎలా ఉంచుకుంటారని ప్రశ్నించారు. ఈసిని తప్పుదోవ పట్టించిన పార్థసారథిపై ఎన్నికలలో ఆరేళ్లు పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశముందన్నారు. ఈసిని మోసం చేసిన వ్యక్తులకు కేబినెట్ నుండి తొలగించాలన్నారు. గవర్నర్‌ను కలిసి పార్థసారథిని బర్తరఫ్ చేయాలని కోరతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఆరుగురు మంత్రులను కూడా తొలగించాలన్నారు.

పార్థసారథికి నైతిక విలువలు ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి వెంటనే తొలగించాలని, రాష్ట్రాన్ని మందు, మద్యం, మైనింగ్ శాసిస్తోందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+