తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్యా యత్నం

కరీంనగర్ జిల్లా రాయికల్‌కు చెందిన రాదారపు జనార్దన్ వడ్రంగి పని చేసుకుంటూ జీవించేవాడు. సకలజనుల సమ్మె సందర్భంగా జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తుందని ఎంతో మథనపడుతుండే వాడని బంధువులు బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన జనార్దన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని స్థానిక శివాజీ విగ్రహం వద్దకు వచ్చాడు.
శివాజీ విగ్రహం ముందు నిలబడి తెలంగాణ నినాదాలు చేస్తూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఎప్పడు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే శరీరమంతా కాలిపోయింది. కాలిన గాయాలతోనే దాదాపు గంటసేపు నరకయాతన అనుభవించిన జనార్దన్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఏఎస్ఐ కృష్ణమూర్తి వచ్చి 108 వాహనంలో చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications