నా గెలుపుపై సర్వే ఇప్పుడే చేయించను: లగడపాటి

రాష్ట్రంలో భావోద్వేగాలు సమసిపోయాయని, ఇక అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు పూర్తి స్థాయి ప్రశాంతత నెలకొందని చెప్పారు. విద్యుత్ సమస్య అన్నిచోట్లా ఉన్నదేనని, ఎక్కువ ధరతో కరెంట్ కొనలేక, ప్రజలపై భారం మోపలేక సందిగ్ధంలో ఉన్నామన్నారు.
ప్రజలపై రూపాయి భారం వేసినా ఒప్పుకోని పరిస్థితి ఉందని, అధిక రేటుపెట్ట్టి కరెంట్ కొంటే నష్టాలు రావా? అని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యుత్ సంస్థ రూ.11వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు. బొగ్గు, గ్యాస్‌కు దేశవ్యాప్త కొరత ఉందని, వాటినీ అధిక ధరతో కొనాల్సి వస్తున్నదని చెప్పారు. వీటి ఆధారంగా విద్యుదుత్పాదన వల్ల యూనిట్ ధర రూ.6-7 వంతున పడుతోందన్నారు.
అందువల్ల కరెంట్ ఉత్పత్తి, సరఫరాపై విస్తృతస్థాయి చర్చ జరిగితే తప్ప కరెంట్ కష్టాలకు తెర పడదని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవితో నిమిత్తం లేదని, విజయవాడ అభివృద్ధే ధ్యేయమని స్పష్టం చేశారు. తన హయాంలో ఇప్పటికే రూ.7వేల కోట్ల నిధులు వచ్చాయని, ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందని తెలిపారు. కృష్ణా డెల్టాకు సకాలంలో నీరందేలా చర్యలు తీసుకునేందుకు ఉన్నతస్థాయిలో, సీఎంతో కూడా మాట్లాడతామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications