కట్నంకోసం: రెండోపెళ్లికి సిద్ధమై భార్యకు పట్టుబడ్డ డాక్టర్

తణుకు పట్టణంలోని ఓ ఆస్పత్రిలో ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామానికి చెందిన సుధా రాణి నర్సుగా పని చేసేది. అదే ఆస్పత్రిలో కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ షఫీ డ్యూటీ వైద్యుడిగా పని చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. కొంతకాలం తరువాత షఫీకి నిడదవోలులోని ప్రభుత్వ కార్మిక శాఖ ఆస్పత్రి లో వైద్యుడిగా ఉద్యోగం లభించింది. దీంతో ఇద్దరూ గత నెల 29న నిడదవోలులోని జిడిఎం చర్చిలో వివాహం చే సుకున్నారు. మళ్ళీ బుధవారం షఫీ మరో వివాహానికి సిద్ధమయ్యాడు.
తణుకులోనే పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి కుమార్తెను షఫీ వివాహమాడాల్సి ఉంది. వివాహ వేదికను తణుకు రూరల్ మండలం పైడిపర్రులోని కాపుల కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా వివాహం జరిపించేందుకు వధూవరుల తల్లిదండ్రులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం కావడంతో అతిథులు వచ్చి భోజన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు.
భోజనాల కోసం సప్లయర్‌గా రాజు అనే వ్యక్తి వచ్చాడు. వరుడి ఫొటోతో ఫ్లెక్సీతో పాటు అతడు కారులో ఉండగా రాజు చూశాడు. గత నెలలో నిడదవోలులో జరిగిన వివాహంలో వరుడు కూడా ఇతడే అని అనుమానించాడు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత సుధా రాణి బంధువులకు సమాచారం అందించాడు. వెంటనే సుధారాణి రావడం, వివాహం నిలిచిపోవడం జరిగిపోయాయి.
అయితే ప్రస్తుతం వివాహం నిశ్చయించుకున్న వారు, వరుడు ఒక అంగీకారానికి వచ్చి కట్నంగా ఇచ్చిన సొమ్ములు ఇచ్చివేయడానికి ఒప్పందం చేసుకుని పెళ్లి రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా వరుడు షఫీ విలేకరులతో మాట్లాడుతూ సుధా రాణి తాను ఇష్టపడ్డామని అంగీకరించాడు. అయితే మూడు నెలల కిందటే ప్రస్తుతం జరగాల్సిన వివాహానికి సం బంధించి నిశ్చితార్థం చేసుకున్నామని, అయితే సుధా రాణిని ఇష్టపడడంతో గత నెల వివాహం చేసుకున్నట్టు తెలిపారు. సుధా రాణితోనే తాను కాపురం చేస్తానని చెప్పాడు.












Click it and Unblock the Notifications