వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభ నేతగా రాహుల్: సోనియాపై ఎంపిల ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: పార్లమెంటులో చురుకైన పాత్ర నిర్వహించడానికి వీలుగా రాహుల్ గాంధీని లోకసభ నేతగా ఎంపిక చేయాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఒత్తిడి పెడుతున్నారు. ఈ మేరకు పది మంది పార్లమెంటు సభ్యులు గురువారం సోనియాకు లేఖ రాశారు. దేశప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని వారు చెప్పారు.

లోకసభ నేతగా రాహుల్ గాంధీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారని, ప్రజా సమస్యలపై అత్యంత ప్రతిభావంతంగా మాట్లాడుతారని, దాని వల్ల ఆయన పార్లమెంటు సహచరులు ఆయనను మార్గదర్శకంగా తీసుకుని ఆయనను ఆనుసరిస్తారని వారు వివరించారు. పార్లమెంటు బయట, లోపల కాంగ్రెసు పలు సమస్యలను ఎదుర్కుంటున్నందున రాహుల్ గాంధీ మరింత పెద్ద పాత్రను, మరింత క్రియాశీలక పాత్రను పోషించడానికి ఇదే తగిన సమయమని వారన్నారు.

రాహుల్ గాంధీ ప్రతిపక్షాలతో, మిత్రపక్షాలతో సమర్థమైన రీతిలో సంబంధాలు నెలకొల్పగలరని వారు అభిప్రాయపడ్డారు. చాలా మంది నాయకులు ఉండవచ్చు గానీ దేశం జనాభాలో 50 శాతం ఉన్న యువత యువకుడు, చురుకైన నాయకుడి కోసం చూస్తున్నారని వారన్నారు. ప్రస్తుతం యువతకు ఆకర్షణీయమైన నాయకుడిగా రాహుల్ ముందుకు వచ్చారని, రాహుల్ సామాన్యులను, యువతను ఆకర్షించగలరని, దానివల్ల పార్టీకి మేలు జరుగుతుందని వారు వాదించారు.

పార్లమెంటులో రాహుల్ క్రియాశీలక పాత్ర దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని వారు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వెళ్లడంతో లోకసభ నేత పదవి ఖాళీ అయింది. ప్రణబ్ స్థానంలో రాహుల్ గాంధీని నిలబెట్టాలని పార్లమెంటు సభ్యులు కోరుతున్నారు.

English summary
Pushing for Rahul Gandhi's active role in Parliament, 10 Congress MPs have written to party chief Sonia Gandhi suggesting his appointment as the Leader of the Lok Sabha, saying it was the "need of the hour" to create a "sense of confidence" among the countrymen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X