లగడపాటీ! బుద్ధి తెచ్చుకో!: హరీష్ రావు హెచ్చరిక

Harish Rao
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందా, లేదా అనేది చూస్తున్నామని, ఇవ్వకపోతే త్వరలోనే ఉద్యమిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు టి. హరీష్ రావు చెప్పారు. ఇందుకోసం తమ పార్టీ అధినేత కేసీఆర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రంగారెడ్డిజిల్లా శామీర్‌పేటకు చెందిన బత్తుల మహేశ్ యాదవ్ తన అనుచరులతో ఆదివారం టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. "సీమాంధ్రులు రంగారెడ్డి జిల్లా మీదుగానే హైదరాబాద్‌కు రాకపోకలు సాగించాలి. జిల్లా ప్రజలు గట్టిగా నిలబడితే సీమాంధ్రో డు ఒక్కడుకూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టడు. హైదరాబాదోడు బయటికి వెళ్లడు" అని అన్నారు.

"అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ దిగ్బంధిస్తారు. తెలంగాణ ఇవ్వకపోతే అలాంటి పోరాటాలకు సిద్ధం'' అని స్పష్టం చేశారు. జీవో 69ని సవరించి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకెళ్తే తిరగబడతామని హెచ్చరించారు. లగడపాటి ఇక్కడి ప్రజలను రెచ్చగొడుతూ ప్రత్యేక రాష్ట్రం తొందరగా రావడానికి పరోక్షంగా సాయం చేస్తున్నారని చెప్పారు."లగడపాటీ! బుద్ధి తెచ్చుకో. పిచ్చి మాటలు మానుకో. వందమంది లగడపాటిలు వచ్చినా తెలంగాణ వచ్చి తీరుతుంది'' అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలుకు వెళ్లాక రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు మద్దతు ఇచ్చారని, అందుకే సిద్దిపేట, సిరిసిల్లల్లో విజయలక్ష్మికి తెలంగాణ దెబ్బ రుచి చూపామని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవటం వల్లనే రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించామని, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓటేయబోమని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే దశలో టీడీపీ అధినేత చంద్రబాబు బైరెడ్డి రాజశేఖర రెడ్డితో రాయలసీమ రాష్ట్రం కావాలని చెప్పించి నయా నాటకానికి తెర తీశారని ఆరోపించారు. లోగడ కేసీఆర్ దీక్షతో తెలంగాణ సాధిస్తే, ఇదే చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.

సీమ రాష్ట్ర డిమాండ్ చంద్రబాబుది కాకపోతే బైరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని చీల్చే కుట్రతో దేవేందర్ గౌడ్‌ను చంద్రబాబే పార్టీ నుంచి బయటికి పంపించారు. ఆటలు సాగవని తెలిసి ఆయన్ను మళ్లీ పార్టీలోకి తీసుకొని రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+