• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫోటో చిచ్చు: కెవిపి జగన్‌వైపే, అరెస్టు భయం.. నేతలు

By Srinivas
|

Madhu Yashki - Tulasi Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో గాంధీ భవనంలో లేక పోవడం బాధాకరమన్న రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కెవిపి వ్యాఖ్యలపై స్పందించారు. తాజాగా పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, పిసిసి ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు.

గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసి రెడ్డి, నిరంజన్ మాట్లాడారు. వైయస్‌కు కాంగ్రెసు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పడం శోచనీయమని, బాధాకరమని తులసి రెడ్డి అన్నారు. దివంగత పార్టీ నేతలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూల మీద వేటికీ నామకరణం చేయలేదని.. కానీ కడప జిల్లాకు మాత్రం వైయస్ పేరు పెట్టామని గుర్తు చేశారు. అనేక ప్రాజెక్టులకు వైయస్ పేరు పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్యానించడం దారుణమన్నారు.

తమ పార్టీ ముఖ్యనేతగా వైయస్‌కు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, గాంధీ భవనంలో అందరి నేతల వలే ఆయనకు గౌరవం ఇస్తామని చెప్పారు. కార్యాలయంలో మిగతా నేతలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ఆయనకూ అలాంటి ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని చెప్పారు. కడపకు వైయస్ పేరు పెట్టడం చిన్న విషయమేమీ కాదన్నారు. కానీ వైయస్ ఫోటోపై వివాదం అర్ధరహితమన్నారు.

కెవిపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా ఉన్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆరోపించారు. కెవిపి కాంగ్రెసులో ఉన్నప్పటికీ మనసంతా జగన్ వైపు ఉందన్నారు. యువజన కాంగ్రెసు కార్యక్రమంలో యువరక్తంలో చిచ్చు పెట్టేందుకే ఆయన అలా మాట్లాడారన్నారు. కావాలనే వైయస్ అంశాన్ని ప్రస్తావించారని మండిపడ్డారు. కేవలం వైయస్ ఫోటోనే కాదని కిరణ్, బొత్సల ఫోటోలు కూడా పెట్టలేదని గుర్తు చేశారు.

జగన్ పార్టీని ముందుండి నడిపించేది కెవిపినే అని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. కెవిపి ముమ్మాటికీ జగన్ కోవర్టేనని అన్నారు. వైయస్‌కు ప్రత్యేకంగా గుర్తింపు అవసరం లేదని, సిబిఐ జెడి కాల్ డేటా వ్యవహారంలో రఘురామరాజు వెనుక కెవిపి ఉన్నారని, రాష్ట్రంలో జరిగిన అవినీతికి కెవిపినే కీలక సూత్రధారి అని మండిపడ్డారు. కాంగ్రెసు, సోనియాలను జగన్ విమర్శిస్తే కెవిపి ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. త్వరలో సిబిఐ కెవిపిని అరెస్టు చేస్తుందన్నారు. అందుకే బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారని మండిపడ్డారు. అతను త్వరలో జగన్ పార్టీలో చేరడం ఖాయమన్నారు.

కాగా ఇప్పటికే డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ కెవిపి వ్యాఖ్యలపై ఉదయం స్పందించారు. గాంధీ భవనంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటే స్వర్గీయ టి.అంజయ్య ఫోటో కూడా ఉండాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం అన్నారు. గాంధీ భవనంలో వైయస్ ఫోటో లేకపోవడంపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు మంగళవారం తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై దామోదర స్పందించారు.

వైయస్ ఫోటో ఉండాలంటే అంజయ్య ఫోటో కూడా ఉండాల్సిందే అన్నారు. వైయస్ తన హయాంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెసులో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారన్నారు. వైయస్‌కు ప్రత్యేకత, ఘన చరిత్ర ఏమీ లేదన్నారు. అంజయ్య ఐనా, వైయస్ ఐనా ఒక్కటే అన్నారు. ఫోటోపై వివాదం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంజయ్య నుంచి వైయస్ దాకా అందరూ సమానమే అన్నారు. ఒకరి ఫోటో ఉంటే మరొకరి ఫోటో కూడా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెసు మహా సముద్రం వంటిదని, ఇటువంటి పెద్ద పార్టీ నుండి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిన వారు ఎందరో ఉన్నారని, అలాంటప్పుడు వైయస్‌కు పాత్ర లేకుండా చేస్తున్నారనటం సరికాదన్నారు. నిధులలో మూడు ప్రాంతాలకు సమతుల్యత ఉండాలని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే ఇంజనీరింగ్ ఫీజులు ఉంటాయన్నారు. రాష్ట్రానికి మెడికల్ సీట్లు రాకపోవడానికి కారణం సమష్టి వైఫల్యం అన్నారు.

English summary
Deputy CM Damodara Rajanarasimha responded on late YS Rajasekhar Reddy photo in Gandhi Bhavan issue on Wednesday, which is raised by Rajyasabha Member KVP Ramachandra Rao on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X