వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ మహాత్ముడు: కొనియాడిన ప్రణబ్ ముఖర్జీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు మహాత్ముడని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. దేశంలో తొలిసారిగా రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టినప్పుడు తాను కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నానని, అప్పుడే ఎన్టీఆర్ నిర్ణయాన్ని అభినందించానని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రణబ్ ముఖర్జీని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు వేణుగోపాల రెడ్డి, సీఎం రమేశ్ మంగళవారం కలసి, అభినందించారు. వీరిని ఆత్మీయంగా ఆహ్వానించిన ప్రణబ్, దాదాపు అరగంటసేపు ఆహ్లాదంగా గడిపారు.

రాజకీయాలను పక్కనపెట్టి మనసువిప్పి మాట్లాడారు. తెలుగుదేశం తనకు ఓటేయలేకపోవటంలో సమస్యలను తాను అర్థం చేసుకోగలనని, కాబట్టి ఆ భావన మనసులో పెట్టుకోవద్దని చెబుతూ పార్లమెంటు సభ్యులు బృందం అభినందనల్ని స్వీకరించారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తిగా తాను చెబుతున్నానని, ఎన్టీఆర్‌కు ప్రజా సమూహంలో మంచి పేరుందని తెలిపారు. అనంతరం నామా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రపతితో తమ సమావేశం ఆత్మీయ వాతావరణంలో జరిగిందని ఆనందం వెలిబుచ్చారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిశారు. కొత్త బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారు.

English summary
President Pranab Mukherjee has praised Telugudesam party founder NT Ramarao. TDP MPs Nama Nageswar, Venugopal Reddy and others met Pranab mukherjee and congratulated him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X