విమర్శలను ఎదుర్కుంటా, వెనక్కి తగ్గను: కిరణ్ రెడ్డి

హైదరాబాదులోని జూబ్లీహాల్‌లో యువ కిరణాలు, ఎంప్లాయిస్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్ కార్యక్రమంలో కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టారని చెప్పారు. యువత ప్రయివేటు రంగంలో ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో ఉద్యానవనం, డెయిరీఫాం వంటి ఉపాధి మార్గాలను మెరుగు పరచుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. విద్యారంగంలో చాలా లోపాలు ఉన్నాయని, విద్యా సంస్థలు కూడా తమ స్వలాభాల కోసం కాకుండా పారిశ్రామిక అవసరాల కనుగుణంగా విద్యా ప్రమాణాలను తీర్చి దిద్దాలని కోరారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, గ్యాస్ కొరత వల్లే ఈ ఇబ్బంది ఏర్పడిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ కోత వల్ల పరిశ్రమలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కామన్ ఫీజు వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జూబ్లీహాల్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఉన్నతవిద్యాశాఖ చైర్మన్ జయప్రకాశ్ నేతృత్వంలో ఈ కమిటీ కొనసాగనుంది. కేసిరెడ్డి, రేమండ్‌పీటర్, సాంబశివరావు, గోపాల్, రామ కృష్టయ్య, తులసీరామ్‌దాస్, ఉదయ్‌లను కమిటీ సభ్యులుగా నియమించారు.