చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'చిరంజీవి ముఖ్యమంత్రి' వ్యాఖ్యలపై బొత్స కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
చిత్తూరు: రాజ్యసభ సభ్యుడు, తమ పార్టీ ముఖ్య నేత చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కొందరు మంత్రులు కోరుకోవడంలో తప్పు లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. చిరు సిఎం అయితే సంతోషమే అన్నారు. ఆయన ఉదయం తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్సించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఆస్తుల కేసులను కోర్టులు, సిబిఐ చూసుకుంటోందని చెప్పారు. కాంగ్రెసును మోసం చేసిన జగన్ పార్టీతో ఎప్పటికీ కలవమన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బిసి డిక్లరేషన్ ఓ జిమ్మిక్కు అని, వారికి వంద సీట్లు ఇవ్వాలనుకుంటే ఆయా నియోజకవర్గాలలో ఇంచార్జులను ప్రకటించాలని సవాల్ చేశారు. ఆర్టీసికి సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

15 లక్షల ఉద్యోగాలు ఇస్తాం: సిఎం

2014 నాటికి తాము చెప్పినట్లుగా 15 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు అన్నారు. ఆయన హైదరాబాదులోని జూబ్లీహాల్‌లో రాజీవ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిస్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. ఈ ఏడాది మూడు లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిస్తామని చెప్పారు.

తమపై ఎన్ని విమర్శలు వచ్చినా యువతకు ఉపాధి కల్పించడంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టారని చెప్పారు. యువత ప్రయివేటు రంగంలో ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టాలన్నారు. విద్యారంగంలో చాలా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరముందన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana said nothing wrong in ministers Ganta Srinivasa Rao and C.Ramachandraiah statements that Chiranjeevi is future Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X