హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ భక్తి: వైయస్ వివేకానంద దారిలో కెవిపి?

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం గానీ, ఆయన వారసత్వాన్ని వాడుకోవడం గానీ సాధ్యం కాదని భావించిన కాంగ్రెసు అధిష్టానం పాత వ్యూహాలకు తెర దించినట్లు చెబుతున్నారు. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని ప్రోత్సహించడం మానేశారని, దానివల్ల ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గూటికి చేరారని అంటున్నారు. అదే తరహా అనుభవం ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుకు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో వైయస్ వివేకానంద రెడ్డి దారిలోనే కెవిపి రామచందర్ రావు పయనిస్తారనే ప్రచారం ఊపందుకుంది.

కెవిపిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ ప్రచారానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. వైయస్ బొమ్మ గాంధీభవన్‌లో లేకపోవడంపై ఆవేదిన వ్యక్తం చేసిన కెవిపిని సురేఖ తప్పు పట్టారు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. అయితే, కాంగ్రెసులో ఓ వర్గానికి తాను నాయకుడినని చెప్పుకోవడానికి కెవిపి వైయస్ భక్తిని ప్రదర్శించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వైయస్ పేరు ప్రస్తావిస్తూ ఢిల్లీలో కాంగ్రెసులో ఓ వర్గాన్ని నడపాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, తన ప్రయత్నాలకు అధిష్టానం నుంచి ప్రోత్సాహం లభించకపోతే మరికొన్ని రోజు లు సందర్భానుసారం వెైఎస్‌ గురించి ప్రస్తావించి, చివరకు జగన్‌ పార్టీలో చేరినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని కాంగ్రెస్‌ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వెైయస్ వివేకాతో పాటు, మరికొందరు సీనియర్లు కూడా ఇదే సాకు చూపి జగన్‌ వెైపు వెళ్లారంటున్నారు. అసలు ఇప్పుడు జగన్‌ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధుల్లో మెజారిటీ శాతం ఒకనాడు కెవిపికి సన్నిహితులేనని, ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారేనని గుర్తుచేస్తున్నారు. వీరిని కెవిపియే జగన్ పార్టీలోకి పంపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

వైయస్ భక్తిని ప్రదర్శించిన కెవిపిపై కాంగ్రెసులోని ఓ వర్గం తీవ్రంగా విరుచుకుపడుతోంది. జగన్‌కు కెవిపి అసలు సిసలు కోవర్టని పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, వి.హన్మంతరావు ఆరోపించారు. జగన్‌ పార్టీ విధానకర్త ఆయనేనని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. అయితే, కెవిపి పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని కొంత మంది నాయకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు చెబుతున్నారు. జగన్‌పెై సిబిఐ దాడులు చేస్తున్నప్పుడు, ఆయన కుటుంబాన్ని అవమానించినప్పుడు కెవిపి ఎక్కడ ఉన్నారని కొండా సురేఖ అడిగారు.

అదే సమయంలో వైయస్ జగన్, వైయస్ విజయమ్మ సోనియా గాంధీపై విమర్శలు చేస్తున్నా కెవిపి రామచందర్ రావు మాట్లాడకపోవడాన్ని కాంగ్రెసు సీనియర్ నాయకులు కొంత మంది ప్రశ్నిస్తున్నారు. కెవిపి ఆత్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో, శరీరం కాంగ్రెసులో ఉందనే వ్యాఖ్యలు చేస్తున్నారు.

English summary
It is said that Congress Rajyasabha member KVP Ramachandra Rao may follow YS Rajasekhar Reddy's brother YS Vivekananda Reddy. It is said that KVP Ramachandra Rao may join in YS Jagan's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X