• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మార్చ్‌తో సత్తా, జానా ఆలోచన సరి కాదు: కోదండరామ్

By Pratap
|

Kodandaram
నల్లగొండ/ హైదరాబాద్: తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని పార్టీలకు మనుగడ లేదని తెలంగాణ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో నిర్వహించే తెలంగాణ మార్చ్‌పై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చర్చ ప్రారంభమైందని ఆయన అన్నారు. మిలియన్ మార్చ్‌తో సత్తా చాటిన తెలంగాణవాదులు మళ్ళీ జరిగే తెలంగాణ మార్చ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం నల్లగొండలో టీజేఏసీ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యమం బలంగా నిర్వహించటంతోపాటు నిత్య జీవితంలో భాగమయ్యేలా చూడాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. సీమాంధ్ర పాలన వల్ల జరుగుతున్న అన్యాయాలను ఎండగడతామని చెప్పారు. సకల జనుల సమ్మె వల్ల ప్రజలు సంఘటితమయ్యారని తెలిపారు. రాష్ట్ర మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశించటం సమంజసం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పదవులు చేపడితే ప్రతిఘటించి తీరతామన్నారు.

రాష్ట్రంలోని మూడుప్రాంతాల ప్రజలు కూడా విడిపోయి కలిసుందామని, అదే శ్రేయస్కరమని పేర్కొంటున్నారని ప్రముఖ తెలంగాణ స్వాతంత్య్రసమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. సద్భావనతో విడిపోవాలనే స్వాతంత్య్ర సమరయోధుల పిలుపుకు బ్రహ్మాండమైన స్పందన వస్తోందని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన హైదరాబాద్ నగర హెచ్ఎఎల్ ఉద్యోగి, రచయిత మురళీకృష్ణ రూపొందించిన విభజన రంగంలో నేనే అయితే ఆడియో సీడీ ఆవిష్కరణ సభ కార్యక్రమం శుక్రవారం అశోక్‌నగర్‌లోని కొండా లక్ష్మణ్‌బాపూజీ నివాసంలో జరిగింది.

సీడీని ఆవిష్కరించిన కొండాలక్ష్మణ్ బాపూజీ మాట్లాడారు. ఆంధ్రలో వద్దంటున్నా విలీనం చేసిన తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాల గురించి వాస్తవాలను వెల్లడించి తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర రాష్ట్రాల నిర్మాణానికి ఏవిధంగా కృషి చేయాలనే అంశాలను సీడీలోని పాటలద్వారా రచయిత మురళీకృష్ణ వెల్లడించారన్నారు. తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసి తెలంగాణాకు అన్యాయం చేశారని అందుకే విడిపోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఈ సీడీలోని పాటలద్వారా ప్రజల్లో మరింత చైనత్యం వస్తుందన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana JAC chairman Kodandaram saif that Telangana March to be taken up in Hyderabad on September 30 will be big success. He said that minister K Jana Reddy's bid to become CM is not acceptable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more