జగన్‌పార్టీలో లేను: లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్‌కు కితాబు

ఈ సందర్భంగా జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ స్థానిక కలుగోళశాంభవి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరలేదని చెప్పారు. కష్టాలలో ఉన్న జగన్‌కు అండగా ఉండాలని ఉప ఎన్నికలలో ఆయనకు మద్దతు పలికానన్నారు. స్వర్గీయ ఎన్‌టిఆర్ తర్వాత సమర్థుడైన నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ లక్షణాలు, చరిష్మా మెండుగా ఉన్నాయన్నారు. చంద్రబాబు నియంతృత్వపు పోకడల వల్లే నేడు తెలుగుదేశం పార్టీ ఈ దుస్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైందన్నారు. వైయస్ బతికి ఉంటే ఇలా జరిగేదా అని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.
రోజుకి కనీసం ఏడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేని ప్రభుత్వానికి పాలించే అర్హతలేదన్నారు. విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా నష్టపోయేది రైతులు, కార్మికులేనన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు షిండే గ్యాస్‌ను ఆ రాష్ట్రానికి తరలిస్తుంటే మన నాయకులు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications