చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Chandrababu Naidu - Kuthuhalamma
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కుతూహలమ్మ సోమవారం పొగడ్తల వర్షం కురిపించారు. కుతూహలమ్మ ఉదయం చెంగల్రాయ నాయుడు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అన్నారు.

తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానంటే అందుకు కారణం చంద్రబాబు అని చెప్పక తప్పదన్నారు. చంద్రబాబు తనను జెడ్పీ చైర్ పర్సన్‌గా చేసి రాజకీయాల్లో రాణించేందుకు తనకు మంచి అవకాశం కల్పించారన్నారు. తన ముప్పయ్యేళ్ల వయసులోనే తనకు రాజకీయ జీవితం కల్పించి మంచి భవిష్యత్తుని ఇచ్చారన్నారు. తనకు కర్నాటక గవర్నర్ పదవి పైన ఆశ ఉందన్నారు.

తమిళనాడు గవర్నర్ రోశయ్య తలుచుకుంటే అది నెరవేరుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా చంద్రబాబును పొగుడుతున్న సమయంలో చెంగల్రాయ నాయుడు సంస్మరణ సభకు వచ్చిన వారంతా చప్పట్లు కొట్టడం గమనార్హం. కాగా కుతూహలమ్మ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన హయాంలోనే ఆమె తన మంత్రి పదవిని కోల్పోయారు.

అప్పటి నుండి ఆమె మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆమెను అది వరించలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెసు పట్ల ఉన్న తన అసంతృప్తిని చంద్రబాబు నాయుడును పొగడటంలోనే కనిపిస్తోందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+