హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇచ్చి నా నిజాయితీ నిరూపించుకుంటా: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతోందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం చిత్తూరు జిల్లాలో అన్నారు. వెనుకబడిన వర్గాలకు దేశవ్యాప్తంగా చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెసేతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపి వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి టిడిపి కృషి చేస్తోందన్నారు.

అసెంబ్లీలో బిసిలకు 100 సీట్లు ఇస్తామని, బిసి వర్కాల ఆర్థికాభివృద్ధికి రూ.10వేల కోట్లతో ఉప ప్రణాళిక ప్రవేశ పెడతామన్నారు. తమ ఈ ప్రకటనతో ఆ వర్గాల్లో చైతన్యం వచ్చిందని, ఇక తమ బతుకులు బాగుపడతాయనే నమ్మకం పెరిగిందన్నారు. టిడిపి తీర్మానాన్ని జీర్ణించుకోలేని పార్టీలు అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయని, వంద సీట్లు బిసిలకు కేటాయించి ఇది సాధ్యమని నిరూపించి నిజాయితీ నిలుపుకుంటామని బాబు అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ బిసిలకు సగం సీట్లు కేటాయిస్తామని, ప్రతి రెండు జెడ్పీటిసి స్థానాలలో ఒక బిసి ఉండేలా, ప్రతి రెండు నామినేటెడ్ పోస్టుల్లో ఒక బిసి ఉండేలా చూస్తామన్నారు. ఏడాది కాలంగా పక్కన పడేసిన బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. ఆగస్టు నెలాఖరులో మిత్ర పక్షాలతో కలిసి పార్లమెంటును ముట్టడిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళికలు ఉన్నాయని, కానీ జనాభాలో యాభై శాతం మంది ఉన్న బిసిలకు ఏమీ లేదన్నారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu challenged Congress and YSR Congress parties on BC declaration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X