వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు: వినోద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vinod Kumar
హైదరాబాద్: బుధవారం నుండి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనందున.. లోకసభకు ఎప్పుడు వెళ్లాలి... ఏం చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ బుధవారం అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి అతి త్వరలో తేలబోతోందని.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాక వైఖరి తెలియజేస్తామని ముఖ్యమైన కాంగ్రెస్ సీనియర్ నేతలు తమకు చెప్పారని తెలిపారు. తెలంగాణపై ఆగస్టు మొదటి వారంలో కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. వారు ఏం చెప్తారోనని కెసిఆర్ సహా తామంతా వేచిచూస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రాంతంలోని నేదునూరు, శంకర్‌పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సీమాంధ్ర శక్తులే అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకొని ఎపి జెన్‌కో ఆధ్వర్యంలోని నేదునూరు, శంకర్‌పల్లి విద్యుత్ కేంద్రాల పనులు ప్రారంభం కాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి సహజవాయువు మళ్లింపును అడ్డుకోవటం హర్షణీయమేనని, కానీ, రాష్ట్రంలో ఇప్పుడున్న గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు తొమ్మిది కూడా ప్రైవేట్ రంగంలోనివే అన్నారు.

ప్రభుత్వ రం గంలో ప్రతిపాదించిన శంకర్‌పల్లి విద్యుత్ కేంద్రం పదేళ్ల నుంచి శంకుస్థాపనకే పరిమితమైందని, నేదునూరు విద్యుత్ కేంద్రానికి 2010, ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేసినా.. ఇప్పటివరకు తట్ట మట్టి తీయలేదని, ఈ ప్రాజెక్టులు నిర్మిస్తేనే గ్యాస్ కేటాయింపులు జరుగుతాయని కేంద్రంలోని మంత్రుల సాధికారిక కమిటీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కాని, వీటి నిర్మాణాలు జరగకుండా సీమాంధ్ర శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. ఎవరైనా అడిగితే చూపించటానికి, ఈ కేంద్రాలను నిర్మిస్తాం.. గ్యాస్ కేటాయించమని కోరుతూ సిఎం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.

ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టులను ఎందుకు నిర్మించట్లేదో.. కనీసం టెండర్లు ఎందుకు పిలవట్లేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేదునూరు, శంకర్‌పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేం ద్రాలను నిర్మిస్తే.. చట్ట ప్రకారం, ప్రభుత్వ రంగానికి చెందిన వాటికి మొదట గ్యాస్ కేటాయింపులు జరుగుతాయన్నారు. కాగా.. సహజ వనరుల వినియోగంపై జాతీయ స్థాయి లో సమగ్ర విధానాన్ని రూపొందించాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించా రు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన మా ట్లాడారు. రీయింబర్స్‌మెంట్ కొనసాగించకపోతే తెలంగాణ ప్రాంత విద్యార్థులు అధికంగా నష్టపోతారన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుందని చెప్పారు.

English summary
Former Telangana Rastra Samithi MP Vinod Kumar said that party cheif K Chandrasekhar Rao is thinking about Telangana and winter praliment sesstions now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X