మంత్రి వేధిస్తున్నారు: ఇస్కాన్ హరికృష్ణ, దానంపై కేసు

తొలుత ఆయన తమతో బాగానే ఉండేవారని, ఇప్పుడే ఇలా అంటున్నారన్నారు. తులసి కోట, జనరేటర్‌లను ఆయన అనుచరులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణలను రేకెత్తించే ఉద్దేశ్యంతోనే వారు ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా తమను టార్గెట్‌గా చేసుకున్నారన్నారు. మంత్రి అయి ఉండి ఇలా ప్రవర్తిస్తే ఎలా అని వారు ప్రశ్నించారు.
ఆలయ అభివృద్ధికే తాము దీనిని ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఉన్నాయని, ఇప్పుడు వచ్చి ఇలా ప్రవర్తించడం అనుమానంగా ఉందన్నారు. ఎవరు అడ్డు వచ్చినా తాము రేపటి కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తామని వారు చెప్పారు.
మరోవైపు ఆలయానికి గేటు వేసి రూల్స్ బ్రేక్ చేస్తామని పోలీసులను దుర్భాషాలాడిన మంత్రి దానం నాగేందర్ పైన పోలీసు కేసు నమోదయింది. స్థానిక ఎస్ఐని దానం దుర్భాషాలాడారు. దీంతో ఎస్ఐ పిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు దానం పైన కేసు నమోదు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications