ప్రియుడి గొడవ, వధువు మద్దతు: ఆగిపోయిన పెళ్లి

శ్రీనివాసులు అనే యువకుడికి జ్యోత్స్నతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. కళ్యాణ మండపానికి ఇరుపక్షాల బంధువులు చేరుకున్నారు. అంతలో పెళ్లి కూతురు ప్రియుడు కేశవ అక్కడికి చేరుకున్నాడు. ఈ అమ్మాయిని తాను ప్రేమించానని, తాము వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నామని చెప్పాడు. దాంతో పెళ్లి కుమార్తె బంధువులు కేశవను ప్రతిఘటించారు. అతను ఆ రాత్రికి వెళ్లిపోయి తిరిగి స్నేహితులతో కలిసి బుధవారం ఉదయాన్నే కల్యాణ మంటపానికి చేరుకున్నారు.
తామిద్దరం ఇంజినీరింగ్ చదువుకునే సమయంలో ప్రేమించుకున్నామని. ఇద్దరి సామాజకవర్గాలు వేరు కావటంతో అమ్మాయి తల్లితండ్రులు ఒత్తిడి చేసి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని చెప్పాడు. ఇదంతా వాస్తవమేనని అమ్మాయి కూడా అంగీకరించింది. తాను ప్రేమించిన కేశవనే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న చెప్పడంతో పెళ్లి కుమారుడు శ్రీనివాసులు కల్యాణ మండపం నుంచి వెళ్ళిపోయాడు.