ఆగ్రా టు ఢిల్లీ: ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన అఖిలేష్

అఖిలేష్ ప్రారంభించడంతో ఈ ఎక్స్‌ప్రెస్ వే క్రెడిట్ ఆయనకే దక్కింది. వేను ప్రారంభించిన అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ.. దాని పైన ప్రారంభించేందుకు తమ పేరు రాసి ఉందని... ఇక దాని గురించి ఏం చెయ్యాలో మేం ఆలోచించాలన్నారు. దీన్ని నిర్మించిన జేపి గ్రూప్ ఆధ్వర్యంలోనే రహదారి నిర్వహణ కొనసాగుతుందని, అలాగే సమీప గ్రామాలకు అవసరమైన సర్వీసు రోడ్లను కూడా అదే నిర్మిస్తుందని అలాగే ఆయా గ్రామాల ప్రజలకు వాటిపై ఎలాంటి ఫీజు చెల్లించకుండానే తిరిగే సౌకర్యం కల్పింస్తుందని చెప్పారు. అలాగే భూ సేకరణ సమయంలో ఆందోళనకు దిగిన రైతులపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తున్నట్లు అఖిలేష్ ప్రకటించారు.
కాగా ఎక్స్‌ప్రెస్ వే వల్ల ఢిల్లీ - ఆగ్రా మధ్య ప్రయాణం అటు ఇటు కాస్త సగం తగ్గిందని చెప్పవచ్చు. రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. సాయంత్రం నాలుగు గంటలకు దీనిపై రాకపోకలను అనుమతించారు. ఈ రహదారిపై మూడు చోట్ల ఏర్పాటు చేసిన టోల్ గేట్ల ద్వారా లైట్ మోటార్ వెహికల్ప్‌కు కిలో మీటరుకు రూ.2.10లు వసూలు చేస్తారు. అంటే ఒకసారి కారులో ప్రయాణానికి రూ.320లు, అదే ద్విచక్ర వాహనాలకైతే రూ.150లు టోల్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రహదారి నిర్మాణంలో అనేక కారణాలతో తీవ్ర జాప్యం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రహదారి నిర్మాణానికి సేకరించిన భూమిపై రైతులు ఆందోళనలు, సమీప గ్రామాలకు ఉచితంగా సర్వీసు రోడ్లను నిర్మించాలన్న డిమాండ్లు రావడం.. అందుకోసం ఆందోళనలు జరగడంతో నిర్మాణ పనులలో జాప్యం తప్పలేదు. అలీగఢ్ జిల్లాల్లో ఈ రహదారి కోసం భూ సేకరణ సమయంలో రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసు కాల్పులకు దారితీసింది.












Click it and Unblock the Notifications