హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ రెడ్డిది ప్రాంతీయాభిమానం కాదా: కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణలోని ఫ్లోరైడ్ ప్రాంతాలను విస్మరించి చిత్తూరు జిల్లాకు కోట్లాది రూపాయలు విడుదల చేయడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాంతీయాభిమానం కాదా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు ప్రశ్నించారు. తెలంగాణ గ్యాస్ ప్రాజెక్టులను కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణకు చెందిన నేదునూరు, శంకరపల్లి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

ఆ రెండు ప్రాజెక్టుల కోసం తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. జెన్‌కో ఆధ్వర్యంలోని ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రైవేట్ సంస్థలపై ఉన్న ప్రేమ ముఖ్యమంత్రికి ప్రభుత్వ సంస్థలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాలుగు వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని, పోలవరంపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు లేదని ఆయన అడిగారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాంతీయ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు సీమాంధ్ర ప్రాజెక్టులకు గ్యాస్ కోసం ఢిల్లీపై దండయాత్ర చేస్తున్నారని, కానీ తెలంగాణ ప్రాజెక్టుల కోసం లేఖలు రాయడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అంతర్గత కుమ్ములాటలో తెలంగాణ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయవద్దని ఆయన సూచించారు.

ల్యాంకో, జిఎంఆర్ యూనిట్లకు గ్యాస్ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ల్యాంకో, జిఎంఆర్‌లు యూనిట్‌కు 3 రూపాయలు లాభం పొందుతున్నాయని చెబుతూ వాటికి గ్యాస్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్టును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, దానిపై తాము న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన చెప్పారు. మెడికల్ సీట్ల విషయంలో కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి ఎందుకు చర్చలు జరపడం లేదని ఆయన అడిగారు.

English summary
Telangana Rastra Samithi MLA KT Rama Rao lashed out at CM Kiran kumar Reddy on Telangana gas based power projects and Polavaram issue. He alleged that Kiran kumar Reddy is working against Telangana projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X