విశాఖలో ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య

శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు. బంధువులే దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. కార్యాలయంలో జరిగిన ఈ ఘనటలో ఇద్దరు దుండగుల ప్రమేయం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మెడపై కత్తితో తీవ్రంగా గాయపరచడమే కాకుండా దుండగులతో చిరంజీవి పెనుగులాడినట్లు ఆధారాలున్నాయి.
ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్రం కెజిహెచ్‌కు తరలించారు. ఐదేళ్లుగా అతను ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఇంటి సెల్లార్‌లోనే కార్యాలయం ఉంటుంది. దీంతో రాత్రి ఆఫీసులోనే అతను నిద్రించినట్లు తెలుస్తోంది.
దుండగులు బీరువాలో ఉన్న నగదును కూడా అపహరించినట్లు సమాచారం. వ్యక్తిగత కక్షలు కూడా హత్యకు కారణమైన ఉండవచ్చుననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు కారణమైతే డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్లుతారనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.
విశాఖపట్నం విశాలాక్షిలోని లక్ష్మినరసింహస్వామి ఆలయంలో చోరీ జరిగింది. విలువైన పురాతన పంచలోహ విగ్రహాలను దుండగులు అపహరించారు. ఆలయ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications