సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై జైపాల్ రెడ్డి ఎదురుదాడి

S Jaipal Reddy
న్యూఢిల్లీ: తెలంగాణలోని నేదునూరు, శంకరపల్లి ప్రాజెక్టులకు కేంద్రం గ్యాస్ కేటాయించడం లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన దాడిపై ఎస్ జైపాల్ రెడ్డికి చెందిన పెట్రోలియం శాఖ ఎదురు దాడికి దిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన లేఖకు వెంటనే స్పందించింది. 'అభద్రతా భావం'తోనే కిరణ్ అభాండాలు వేస్తున్నారనే రీతిలో జైపాల్ నేతృత్వంలోని పెట్రోలియం శాఖ ఎదురుదాడి చేసింది. జైపాల్ రెడ్డికి, కిరణ్ రెడ్డికి మధ్య ఇప్పటి వరకు లోలోపల, పరోక్షంగా సాగిన యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష సమరంగా మారుతోంది. ప్రకటనలు విడుదల చేస్తూ నేరుగా పేర్లు ప్రస్తావించుకునే దాకా ఈ సమరం వెళ్లింది.

"నేదునూరు, శంకరపల్లి కొత్త ప్రా జెక్టులు. మంత్రుల బృందమే గ్యాస్ కేటాయించాలి. అంతేకానీ, ఆంధ్రా ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు అని తేడా లేదు'' అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక్కడి వరకు చూస్తే.. పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డిని సీఎం ఎక్కడా తప్పుపట్టినట్లు అనిపించదు. కానీ.. ఆ తర్వా త సీఎంవో విడుదల చేసిన ప్రకటన మాత్రం నేరుగా జైపాల్‌కే గు రి పెట్టింది. "తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులు చాలా కీలకం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని అనుమతులు, కేటాయింపులు జరిగిపోయాయి. భూసేకరణ పూర్తయింది. నీటిని కూడా కేటాయించడం. గ్యాస్ ఇవ్వడమే ఆలస్యం. అందువల్ల... నేదునూరుకు 9.72 ఎం ఎంఎస్‌సీఎండీ, శంకర్‌పల్లికి 4.62 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జైపాల్‌రెడ్డిని సీఎం కోరారు' అని ఆ ప్రకటనలో వివరించారు.

గతనెల 7న జైపాల్‌కు సీఎం లేఖ రాసినట్లు తెలిపారు. అంతటితో ఆగక.. 'తెలంగాణ ప్రాంతానికే చెందిన జైపాల్‌రెడ్డి ఈ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, త్వరగా గ్యాస్ కేటాయింపులు జరిగేలా చూడటం సముచితం' అని ముక్తాయించారు. 'గ్యాస్ బంతి'ని జైపాల్ కోర్టులోకే విసిరేశారు. ఈ విషయంలో తన ప్రయత్నాలు తాను చేశానని. జాప్యం జరిగితే తప్పంతా జైపాల్ రెడ్డిదే అని కిరణ్ తేల్చేశారు. ముఖ్యమంత్రి లేఖలోని అంశాలపై జైపాల్ రెడ్డి నేతృత్వంలోని పెట్రోలియం శాఖ తీవ్రంగా స్పందించింది. 'పదేపదే కోరినా ఫలితం లేకపోయింది' అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ఏదో అభద్రతా భావంతోనే సీఎం ఈ విమర్శలు చేస్తున్నట్లుంది' అని ఆ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 'సొంత ప్రాంత' ప్రయోజనాలకు జైపాల్ ప్రాధాన్యం ఇవ్వడంలేదనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలనూ తప్పుపట్టారు.

"దేశవ్యాప్తంగా గ్యాస్ నిల్వల గురించి తెలిసి కూడా సీఎం ఇలా తప్పుడు ప్రచారం చేయడం తగదు. కేజీ బేసిన్ నుంచి 80ఎంఎంసీఎంసీడీల గ్యాస్ ఉత్పత్తిని అంచనా వేయగా... కేవలం 29 యూనిట్లు మాత్రమే లభ్యమవుతోంది. దాదాపు 51 యూనిట్లకు కొరత ఏర్పడింది. దీంతో వల్ల దేశంలో దాదాపు 10వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు సరఫరా పునరుద్ధరించినా 50 శాతం మాత్రమే సరఫరా చేయగలిగిన పరిస్థితి ఉంది. అనిల్ అంబానీ, లాంకో, జీఎంఆర్, స్రవంతి లాంటి సంస్థలు కూడా గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పాయి. వాటికి బ్యాంకులు రూ. 30వేల కోట్ల మేరకు రుణాలు ఇచ్చాయి. వాటికి కూడా గ్యాస్ సరఫరా చేయగలిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కనీసం నిర్మాణమే పూర్తి కాని శంకరపల్లి, నేదునూరు ప్రాజెక్టులకు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది?'' అని పెట్రోలియం శాఖ ప్రశ్నించింది.

వాటిని సీఎం కిరణ్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీసింది. కనీసం పూర్తి చేసి ఉంటే గ్యాస్ సరఫరా గురించి పరిశీలించగలమని చెప్పింది. "ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అభాండాలు వేయడం, అబద్దాలు ప్రచారం చేయడం సరికాదు. గ్యాస్ దిగుమతి చేసుకోవాలన్నా ఆర్ఎల్ఎన్‌జీ టర్మినల్స్ పూర్తి చేయాలి. ఒక్క టర్మినల్‌కూ 5 ఏళ్లు పడుతుంది. ఆర్ఐఎల్ఎన్‌జీ కోసం గెయిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో మేము కుదిర్చిన ఒప్పందం ప్రకారం అది సరఫరా కావడానికి మరో మూడేళ్లు పడుతుంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. అంతేతప్ప... ఎవరిపైనో అభాండాలు వేయడం తగదు'' అని ముఖ్యమంత్రికి పెట్రోలియం శాఖ వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+