విజయ చేరిక: మీరూరండి: విజయమ్మ, జగన్‌తో.. రోజా

అలాంటి వ్యక్తి తనయ తమ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. పిజెఆర్ ఆశయాల కోసం విజయా రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేయాలని విజయా రెడ్డి కోరుకోవడం సంతోషకమన్నారు. సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజు మాట్లాడుతూ.. జగన్ నాయకత్వంలో పని చేసేందుకు వచ్చిన విజయా రెడ్డికి ఘన స్వాగతమన్నారు.
చక్కని రాజ్యాంగ పాలన రావాలంటే వైయస్ జగన్‌తోనే సాధ్యమని ఆమె అన్నారు. నిత్యం పేద ప్రజల కోసం తపించిన వ్యక్తి పిజెఆర్ అని, అలాంటి ఉన్నత వ్యక్తి కూతురు విజయా రెడ్డి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. అందరం కలిసి పార్టీ కోసం పని చేస్తామన్నారు.
కాగా అంతకుముందు విజయా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసమే తాను జగన్ పార్టీలో చేరానని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ఇక నుండి ముందుకు సాగుదామని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు మనమంతా ఒకే పార్టీలో ఉన్నామని విజయా రెడ్డి పిజెఆర్ అభిమానులను ఉద్దేశించి అన్నారు. కాబట్టి రెండు వర్గాలుగా కాకుండా అందరం ఒకటిగా ఉండి ఉద్యమిద్దామన్నారు. ఇప్పుడు మనమంతా ఒకటే అన్నారు. ఇద్దరు నేతలను(పిజెఆర్, వైయస్ఆర్) కలిపిన ఘనత తనదే అని చెప్పారు.
తాను తన తండ్రి ఆశయాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మీ అందరి బలమే మన బలమని ఆమె అన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల కోసమే పాటుపడతామని అన్నారు. స్వర్గీయ పిజెఆర్, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అహర్నిశలు ప్రజల కోసం పాటుపడ్డారని, అందుకే ప్రజలు వారిని గుండెల్లో దాచుకున్నారన్నారు. వారి బాటలోనే నడుద్దామని చెప్పారు. విజయా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న సందర్భంగా భారీగా అభిమానులు తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications