గాలి బెయిల్ డీల్: 8 మందిపై చార్జిషీట్ దాఖలు

అరెస్టయిన న్యాయమూర్తి పట్టాభి రామారావుతో సహా ఎనిమిది మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఎసిబి చార్జిషీటులో గాలి జనార్దన్ రెడ్డి బంధువు దశరథరామి రెడ్డి, సోదరుడు సోమశేఖర రెడ్డి, కంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబు, పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావు, న్యాయవాది ఆదిత్య, రౌడీషీట్ యాదగిరిపై అభియోగాలు మోపారు.
ఈ కేసులో ఎసిబి అధికారులు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. మిగతా ముగ్గురిపై ఎసిబి మరో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడానికి 20 కోట్ల రూపాయలు డీల్ కుదిరినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. యాదిగిరి ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించారు.
గాలి జనార్దన్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి ఎఎంసి కేసులో బెంగళూర్ జైలులో ఉన్నారు. పిటి వారంట్‌పై ఆయనను హైదరాబాదుకు తీసుకుని వచ్చి ప్రశ్నించే అవకాశాలు కూడా అంటున్నారు. కర్ణాటక ఇండిపెండెంట్ శాసనసభ్యుడు శ్రీరాములుకు కూడా ఈ కేసులో ఎసిబి నోటీసులు జారీ చేసింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications