హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాయకత్వ మార్పుపై చెప్పలేను: వాయలార్ రవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
హైదరాబాద్: రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందా, లేదా అనే విషయం తాను చెప్పలేనని, అయినా అది ప్రైవేటు ప్రదేశాలలో చర్చించే అంశం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వయలార్ రవి వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వైవాహిక స్వర్ణోత్సవానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ప్రస్తుతం రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడేదేమీ లేదంటూనే పలు విషయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉందా లేదా అన్నది చెప్పలేనని, కేరళ రాష్ట్రవాసినైన తనకు ఇక్కడ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వబోరని చమత్కరించారు. గ్యాస్ వ్యవహారంలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి, సీఎం కిరణ్‌కు మధ్య అగాధం ఉందనే విషయం తనకు తెలియదని, ఉంటే మాత్రం తానేం చేయగలనని అన్నారు.

త్వరలో హైదరాబాద్ వచ్చి అప్పుడు పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తానని వయలార్ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు అప్పుడు వరుసగా సమావేశాలు పెట్టుకుంటామని చెబుతూ అంతమాత్రాన పార్టీ బలహీనంగా ఉందని కాదని, మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. కాగా, వయలార్ ఈనెల 16న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి మధ్య గ్యాస్ కేటాయింపుల విషయంలో తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగుమనే పరిస్థితి ఉంది. కాంగ్రెసు నాయకులు రెండు చీలిపోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

English summary
AICC observer Vayalar Ravi said that he doesn't know anything about leadership change in Andhra Pradesh. He also said that he is not aware of rift between CM Kiran kumar Reddy and union minister S Jaiapal Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X