వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్మానకు అండ: బొత్స, రాజీనామా వద్దు.. రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Raghuveera Reddy
విజయనగరం/హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాద రావుకు సొంత పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. గురువారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి తదితరులు ధర్మాన రాజీనామా అంశంపై స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు సహజమేనని బొత్స అన్నారు. ధర్మాన రాజీనామాతో పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు. ధర్మానకు పార్టీ, ప్రభుత్వం నుండి సహాయం ఉంటుందన్నారు. ఆయనకు పార్టీ, ప్రభుత్వం నుండి మద్దతు లేదనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు.

సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లోని వివరాలు చూశాక ధర్మాన రాజీనామాపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేసిన వారు ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసినప్పుడు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని బొత్స ప్రశ్నించారు. విద్యుత్ కోతల విషయంలో ట్రాన్సుకో అధికారులను తప్పుపట్టవద్దని బొత్స వేరుగా విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో సూచించారు.

విద్యుత్ కోతల విషయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. నిర్వహణా లోపం ఉంటే అధికారులను నిలదీయాలని సూచించారు.

ధర్మానకు రఘువీరా మద్దతు

ధర్మానకు మంత్రి రఘువీరా రెడ్డి మద్దతు పలికారు. వైయస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని మంత్రివర్గ సమష్టి నిర్ణయాలే అన్నారు. ధర్మాన నిబద్ధత కలిగిన నేత అని, ఆయన ఏ తప్పు చేయలేదన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదన్నారు.

సిఎంను కలిసిన శ్రీకాకుళం జిల్లా నేతలు

శ్రీకాకుళం జిల్లా నేతలు పలువురు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ధర్మాన రాజీనామాను ఆమోదించ వద్దని, ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నేత అని, ఆయన ఏ తప్పు చేయరని వారు సిఎంతో చెప్పారు. ఆయనను మంత్రివర్గంలో అలాగే కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు.

English summary
Minister Raghuveera Reddy and PCC chief Botsa Satyanarayana were supported minister Dharmana Prasad Rao on VANPIC issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X