వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ హోస్టెస్ సూసైడ్: పరారీలో మంత్రి, ట్విస్ట్ డైవర్టా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gopal Kanda
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో ప్రథమ ముద్దాయి, మాజీ మంత్రి గోపాల్ కందా ఇంకా పరారీలోనే ఉన్నారు. గీతిక ఆత్మహత్య చేసుకొని పదకొండు రోజులు దాటినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఇంకా ప్రథమ నిందితుడిని పట్టుకోలేదు. అయితే గోపాల్ కందా స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ ఈ కేసును విచారణ చేస్తున్న అధికారులు మాత్రం అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కోలేక పోతున్నారు. ఇన్ని రోజులవుతున్నా కందాను పట్టుకోక పోవడంతో ఆగ్రహం చెందిన ప్రజలు, విపక్షాలు ఢిల్లీ పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాయి.

పోలీసులు, రాజకీయ నేతల అండదండలతోనే అతను తప్పించుకొని తిరుగుతుండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆగస్టు 8వ తేదిన కందాకు పోలీసులు తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కందా పోలీసులకు చిక్కలేదు. బుధవారం రోజు పోలీసులు మాట్లాడుతూ... తాము సుమారు 50 ప్రాంతాలలో రైడ్ చేశామని, 25 మందికి పైగా విచారించామని కానీ కందా మాత్రం ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని చెప్పారు.

ముందస్తు బెయిల్ కోసం ఇటీవల కందా లాయర్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసి పుచ్చింది. తన పిటిషన్‌లో కందా.. పోలీసుల ఎఫ్ఐఆర్‌లో ఏం లేదని, ఆత్మహత్య చేసుకున్న గీతిక శర్మ సెన్సిటివ్ అని, తాను ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు మాత్రం ఆయన పిటిషన్‌ను తోసి పుచ్చింది. పోలీసులు మాత్రం ఈ కేసును చేధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

విచారణ సమయంలో పోలీసులు పలు విషయాలు గుర్తించారు. గీతిక ఎండిఎల్ఆర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో తన పని పూర్తయిన తర్వాత కందాను కలిసి పూర్తి రిపోర్ట్ ఇచ్చేదని విచారణ అధికారులు గుర్తించారు. అలాగే కొన్ని షాకింగ్ విషయాలు కూడా వారి దృష్టికి వచ్చాయి. ఈ కేసులో అరెస్టైన అరుణ చద్దా.. గీతికకు అబార్షన్ అయిందని చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గీతిక కుటుంబ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.

దర్యాఫ్తును పక్కదోవ పట్టించి కేసును నీరుగార్చేందుకే అరుణ చద్దా గీతికకు అబార్షన్ అయిందని చెబుతుండవచ్చునని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గీతిక ఈ నెల 5వ తేదిన కందా, చద్దా తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. గీతికతో మాట్లాడేందుకు కందా ఉపయోగించిన సిమ్ కార్డ్స్ తన కంపెనీలో పని చేస్తున్న ఇతర ఉద్యోగి పేరు మీద తీసుకున్నవని తెలుస్తోంది. సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ ఉద్యోగిని కూడా అరెస్టు చేశారు.

మరోవైపు కందాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇరవై నాలుగు గంటలలోగా ఈ వారెంట్ అమలు అయ్యేలా చూడాలని కోర్టు ఆదేశించింది.

English summary
Many people and opposition leaders have began criticising Delhi police and ruling state government saying that the high profile accused in the case - Kanda might have been allowed to escape and roam all around without being noticed by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X