గీతిక ఆత్మహత్య: కందాపై నాన్ బెయిలబుల్ వారంట్

కందా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగులో ఉండగానే రోహిణి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. కందా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. సిర్సాలోని కందా నివాసంలో ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి మరోసారి సోదాలు నిర్వహించారు. కందా బంధువును ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసిన తర్వాత పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.
గీతిక ఈ నెల 5వ తేదిన కందా, చద్దా తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. గీతికతో మాట్లాడేందుకు కందా ఉపయోగించిన సిమ్ కార్డ్స్ తన కంపెనీలో పని చేస్తున్న ఇతర ఉద్యోగి పేరు మీద తీసుకున్నవని తెలుస్తోంది. సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ ఉద్యోగిని కూడా అరెస్టు చేశారు.
గీతిక ఎండిఎల్ఆర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో తన పని పూర్తయిన తర్వాత కందాను కలిసి పూర్తి రిపోర్ట్ ఇచ్చేదని విచారణ అధికారులు గుర్తించారు. అలాగే కొన్ని షాకింగ్ విషయాలు కూడా వారి దృష్టికి వచ్చాయి. ఈ కేసులో అరెస్టైన అరుణ చద్దా.. గీతికకు అబార్షన్ అయిందని చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గీతిక కుటుంబ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.దర్యాఫ్తును పక్కదోవ పట్టించి కేసును నీరుగార్చేందుకే అరుణ చద్దా గీతికకు అబార్షన్ అయిందని చెబుతుండవచ్చునని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications